Sidhu On Congress: మాఫీయా రాజ్ కారణంగానే కాంగ్రెస్ ఓడింది- సిద్ధు సంచలన కామెంట్స్- సీఎం మన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు
సిద్ధు మరోసారి కాంగ్రెస్ పార్టీలో వివాదాన్ని రేపారు. పంజాబ్‌లో మాఫీయారాజ్ కారణంగానే ఓడిపోయామంటూ కామెంట్స్ చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితిపై నవజ్యోత్ సింగ్ సిద్ధు సంచలన కామెంట్స్ చేశారు. మాఫీయారాజ్ కారణంగానే పార్టీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించి పార్టీని ఆవిష్కరించోవాల్సిన అవసరం ఉందన్నారు సిద్ధు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో మార్పులు జరగాలని గట్టిగానే చెప్పారు.
"నేను ఇంతకుముందు మాట్లాడలేదు, కానీ ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంది. ఐదేళ్ల మాఫియా రాజ్ పాలన కారణంగా కాంగ్రెస్ ఓడిపోయింది." అని సిద్ధు సీరియస్ కామెంట్స్ చేశారు.
Congress Needs To 'Reinvent Itself', Says Sidhu As He Lauds 'Honest' #Bhagwantmann https://t.co/p2QgLV9WWd
— ABP LIVE (@abplive) April 23, 2022
మాఫియాకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పోరాడుతానన్నారు కాంగ్రెస్ నేత సిద్ధు. ఇసుక తవ్వకాలు, రవాణా, కేబుల్ టీవీ రంగాల్లో మాఫియాలు ఉన్నాయని గతంలోనే పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాటి కారణంగానే ఓడిపోయినట్టు ఇప్పుడు చెబుతున్నారు.
" నా పోరాటం ఏ ఒక్కరిపైనా కాదు. ఇది వ్యవస్థకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో చెదపురుగుల్లా తినే కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా ఉంది"అని సిద్ధూ అన్నారు. తన పోరాటం పంజాబ్ ఉనికి కోసమే అన్నారు. ఏ పదవి కోసమో తాను ఇలాంటి విమర్సలు చేయడం లేదన్నారు.
"రాజకీయాలు వ్యాపారంగా ఉన్నంత వరకు అది గౌరవంగా ఉండదని..... పంజాబ్ మాఫియా రహితంగా మారినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని," అన్నారాయన.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై కూడా కాంగ్రెస్ నేత సిద్ధు పొగడ్తలతో ముంచెత్తారు. ఆన తన తమ్ముడని సంబోధిస్తూ..."నిజాయితీ గల వ్యక్తి" అని కూడా ప్రశంసించారు.
@sherryontopp @DrDrnavjotsidhu https://t.co/nv2umIiD6b
— Gurvarinder Singh Sanauria (@Gurvarinder13) April 23, 2022
మాఫియాకు వ్యతిరేకంగా పోరాడితే ప్రస్తుత ముఖ్యమంత్రి మన్‌కు మద్దతిస్తానని సిద్ధూ అన్నారు.
"అతను నిజాయితీపరుడు. నేనెప్పుడూ అతన్ని తప్పుపట్టలేదు. అతను మాఫికాయకు వ్యతిరేకంగా పోరాడితే, పార్టీ శ్రేణుల కంటే కూడా నా మద్దతు అతనికే ఉంటుంది, ఎందుకంటే ఇది పంజాబ్ ఉనికి కోసం పోరాటం"అని అభిప్రాయపడ్డారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధు ఈ కామెంట్స్ చేశారు.