అన్వేషించండి

Supreme Court: ఆ విధంగా పుట్టిన పిల్లలకూ ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: చెల్లని వివాహాల ద్వారా పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది.

Supreme Court: తల్లిదండ్రుల ఆస్తుల్లో వాటాకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గుర్తింపు లేని పెళ్లి లేదా చెల్లని వివాహం చేసుకున్న దంపతులకు పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుంది అని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆ పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి పొందడానికి అర్హులేనని, వారికి కూడా చట్టపరమైన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు శుక్రవారం తన తీర్పులో తెలిపింది. అలాంటి పిల్లలకు చట్టబద్ధత కల్పించాలని పేర్కొంది. హిందూ వారసత్వం చట్టాల ప్రకారం మాత్రమే తల్లిదండ్రుల ఆస్తిపై హక్కులు పొందుతారని వెల్లడించింది. 

చెల్లని వివాహాలు చేసుకున్న దంపతుల ద్వారా జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రులు, పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉందా లేదా చట్టపరమైన సమస్యపై 2011 నుంచి పెండింగ్ లో న్న పిటిషన్ పై తీర్పు వెలువరించింది. గత నెల నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై పలువురు న్యాయవాదుల వాదనలను విచారించింది. ఈ మేరకు తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం ఇవాళ వెలువరించింది.

2011 లో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్.. చెల్లని వివాహాల ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల స్వీయ ఆర్జిత ఆస్తిలో మాత్రమే వాటా ఉంటుందని, వారి పూర్వీకుల కాపర్సెనరీ ఆస్తిలో వాటాను కోరలేరని, అందుకు వారికి అర్హత ఉండదని తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లోనే పిటిషన్ దాఖలైంది. దానిపై విచారించిన సుప్రీం కోర్టు.. అప్పటి తీర్పును కొట్టివేసి తాజా తీర్పును వెలువరించింది. 

Also Read: Rs 2000 Exchange: బ్యాంకులకు చేరిన 93 శాతం 2వేల నోట్లు, సెప్టెంబర్ 30 వరకు గడువు

చెల్లుబాటు కాని పెళ్లి ద్వారా లేదా లివిన్ రిలేషన్ షిప్ ద్వారా జన్మించిన పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటాకి అర్హత లేదని, వారు కేవలం తల్లిదండ్రుల స్వీయ ఆర్జిత ఆస్తులలో మాత్రమే వాటాను అడిగే హక్కును కలిగి ఉంటారని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది. లివిన్ రిలేషన్ ద్వారా పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటాకు అర్హులే అనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget