News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంలో ఆగస్టు 5న కీలక దశ- శాస్త్రవేత్తల్లో టెన్షన్‌

Chandrayaan-3: భారత్ పతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుని ప్రభావ పరిధిలోకి ప్రవేశిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది.

FOLLOW US: 
Share:

Chandrayaan-3: భారత్ పతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుని ప్రభావ పరిధిలోకి ప్రవేశిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన దశ 5వ తేదీన జరుగనుంది. ఈ మిషన్‌లో అతి క్లిష్టమైన దశ చంద్రయాన్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించి కచ్చితమైన ప్రణాళికతో చేస్తేనే చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి సాధ్యమవుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ చంద్రయాన్-3ని అందుకోవడంలో విఫలమైతే విపరీతమైన పరిణామాలు ఉంటాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి కారణంగా అంతరిక్ష నౌక చంద్రునిపై కూలిపోవచ్చు లేదా దాని నుంచి దూరంగా ఎగిరిపోయే అవకాశం ఉంది.

ఆ తరువాత చంద్రుని సహజ కక్ష్య ప్రకారం అంతరిక్ష నౌక భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించవచ్చు. ఫలితంగా భూమికి అత్యంత సమీప బిందువు (పెరిజీ) సుదూర బిందువు (అపోజీ) మధ్య దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఖగోళ వస్తువుల గురుత్వాకర్షణ శక్తులతో భూమి వైపు చంద్రయాన్-3 ప్రయాణం ప్రభావితమవుతుంది. వ్యోమనౌక చంద్రుని ఉపరితలానికి చాలా దగ్గరగా కక్ష్యలో ఉంటే, చంద్రుని గురుత్వాకర్షణకు అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ రెండింటికి విరుద్ధంగా.. ఉపగ్రహం చంద్రుని నుంచి కొంచెం దూరంగా ఉంటే భూమి గురుత్వాకర్షణ శక్తి అంతరిక్ష నౌకను బయటకు లాగి, చంద్రునికి దూరంగా విసిరేస్తుంది. 

దీంతో చంద్రయాన్ భూమి నుంచి గురుత్వాకర్షణ శక్తి లేకుండా అంతరిక్షంలో తేలుతుంది. భూమి నుంచి వేగం, దూరం మిశ్రమం వ్యోమనౌక పడిపోకుండా అంతరిక్షంలోకి విసిరేయకుండా  సమతుల్యత పాటిస్తుంది. ఈ సమతుల్యతే చంద్రుడిని భూమి చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఇదే సూత్రం చంద్రయాన్-3 తిరుగు ప్రయాణంలో వర్తిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇస్రో చంద్రయాన్‌ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు అంతరిక్ష నౌకకు ఆదేశాలు, సూచనలు ఇస్తుంది. ఈ దశలో ఖచ్చితమైన లెక్కలు, సమయం చాలా కీలకం. ఏ మాత్రం తేడా జరిగినా అంతరిక్ష నౌక అంతరిక్షంలో పోవడం లేదా, భూమి లేదా చంద్రునిపై క్రాష్ అవుతుంది. అదే జరిగితే, మిషన్‌ను మళ్లీ చంద్ర కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి తగినంత ఇంధనం ఉండకపోవచ్చని ఇస్రో మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడ మరో సమస్య ఏర్పడేందుకు అవకాశం ఉంది. రేడియేషన్‌తో కూడిన స్పేస్‌లో అంతరిక్షనౌక ఎక్కువ సేపు ఉండడం ద్వారా కొన్ని సాధనాలు పనిచేయకపోవచ్చు.

ప్రస్తుతం నిపుణులను ఆందోళనకు గురిచేసే విషయం ఏమిటంటే  శుక్రగ్రహంపైకి అంతరిక్ష నౌకను పంపిన జపాన్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. 2010 డిసెంబరులో జపాన్ అకాట్‌సుకీ అంతరిక్ష నౌకను శుక్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు కక్ష్యపెంపు విజయవంతం కాలేదు, ప్రణాళిక ప్రకారం గ్రహం కక్ష్య ద్వారా అంతరిక్ష నౌకను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైంది. ఆర్బిట్ ఇన్సర్షన్ బర్న్ సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ ప్రధాన ఇంజిన్‌లో లోపం కారణంగా ఇది సంభవించింది. ఈ వైఫల్యం ఫలితంగా, అకాట్‌సుకీ మొదటి ప్రయత్నంలోనే శుక్రగ్రహం చుట్టూ స్థిరమైన కక్ష్యలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోయింది. పరిస్థితిని విశ్లేషించి, అవసరమైన సర్దుబాట్లు చేసిన తర్వాత, JAXA డిసెంబర్ 2015లో రెండవ ప్రయత్నాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ ప్రయత్నంలో, స్పేస్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లు సరిగ్గా పనిచేయడంతో అకాట్‌సుకీ విజయవంతంగా వీనస్ చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది.

Published at : 03 Aug 2023 02:16 PM (IST) Tags: ISRO Chandrayaan 3 moon orbit insertion

ఇవి కూడా చూడండి

Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

ABP-CVoter Snap Poll: ఇక్కడ నరేంద్ర మోడీ, మరీ అక్కడెవరు ? I.N.D.I.A. కూటమి డిసైడ్ చేస్తుందా ?

ABP-CVoter Snap Poll: ఇక్కడ నరేంద్ర మోడీ, మరీ అక్కడెవరు ? I.N.D.I.A. కూటమి డిసైడ్ చేస్తుందా ?

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్