అన్వేషించండి

Maintenance for wife: భార్యలు ఇంట్లో పనిమనుషులు కాదు - విడాకులు కోరిన భర్తకు షాక్ - ముంబై హైకోర్టు సంచలన తీర్పు.

Wives are not maids: వంట చేయడం లేదని భార్యకు విడాకులు ఇద్దామని ఓ భర్త కోర్టుకెళ్లాడు. అయితే కోర్టు భార్య పనిమనిషి కాదని స్పష్టం చేసి ఆమెకు నెలకు 20 వేల భరణం చెల్లించాలని కోర్టు భర్తను ఆదేశించింది.

Bombay HC wives are not maids ruling : ముంబై హైకోర్టు   ఇచ్చిన సంచలన తీర్పు భార్యాభర్తల బాధ్యతలు, వైవాహిక సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది. భార్య ఇంట్లో వంట చేయలేదని, ఇంటి పనులు సరిగ్గా చేయడం లేదని ఆమెకు విడాకులు ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.  వివాహం అనేది ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య భాగస్వామ్యం మాత్రమే తప్ప, అది ఒక సర్వీస్ కాంట్రాక్ట్ కాదు. భార్యలు ఇంట్లో పనిమనుషులు కారు అని న్యాయమూర్తులు జస్టిస్ భారతి డాంగ్రే,  జస్టిస్ మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం తేల్చిచెప్పింది.

 వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అయిన ఒక వ్యక్తి, తన భార్య ఇంటి పనులు చేయడం లేదని, తన తల్లిదండ్రులకు విధేయత చూపడం లేదని, ఆమె ప్రవర్తన వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నానని పేర్కొంటూ 2004లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై 2010లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ, భార్యకు భరణం నిరాకరించింది. అయితే, దీనిని సవాలు చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

భార్య ఇంటి పనులు చేయకపోవడం అనేది మానసిక వేధింపుల కిందకు రాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రతి వివాహంలోనూ ప్రారంభ దశలో చిన్నచిన్న సర్దుబాట్లు, మనస్పర్థలు ఉండటం సహజమని, వాటిని తీవ్రమైన క్రూరత్వంగా పరిగణించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేవలం వంట చేయడం, క్లీనింగ్ వంటి పనుల ఆధారంగా విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేస్తూ, పాత విడాకుల ఉత్తర్వులను రద్దు చేసింది.

ఇక భరణం విషయంలో కూడా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సదరు భార్య గతంలో  ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసుల కోసం ప్రకటన ఇచ్చిందని, అది ఆమెకు స్థిరమైన ఆదాయం చూపుతుందని ఫ్యామిలీ కోర్టు భరణాన్ని నిరాకరించింది. దీనిని తప్పుపట్టిన హైకోర్టు.. కేవలం ఒక ప్రకటన లేదా చిన్నపాటి నైపుణ్యం ఉండటం వల్ల అది స్థిరమైన జీవనోపాధి కిందకు రాదని పేర్కొంది. భర్తకు ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి, ఆమెకు నెలకు రూ. 10,000 భరణం,  నివాసం కోసం మరో రూ. 10,000 చెల్లించాలని ఆదేశించింది.  

ఈ తీర్పు భవిష్యత్తులో విడాకుల కేసులపై పెద్ద ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సామాజికంగా భార్యలపై ఉండే  ఇంటి పని' ఒత్తిడిని చట్టపరమైన బాధ్యతగా చూడకూడదనే స్పష్టతనిచ్చింది. కేవలం మూస పద్ధతులతో భార్యపై ఆరోపణలు చేసి విడాకులు పొందడం ఇకపై అంత సులభం కాదని ఈ తీర్పుతో అర్థమవుతోంది.                           

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget