అన్వేషించండి

Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్

బెంగళూరులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ విజయ్ మల్లికార్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Bengaluru Flipkart Delivery Agent | బెంగళూరు నగరంలో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైట్‌ఫీల్డ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని ఫ్లిప్‌కార్డ్ డెలివరీ బాయ్ విజయ్ మల్లికార్జున్ కామత్‌గా గుర్తించారు. బాధితురాలు నిలోఫర్ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 75, 79, 329(2) కింద క్రైమ్ నెంబర్ 345/2026 తో కేసు నమోదు చేసి, పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

అసలేం జరిగిందంటే.. 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. నిందితుడు విజయ్ మల్లికార్జున్ కామత్, బెంగళూరుకు చెందిన నిలౌఫర్ ఫాతిమా నివాసానికి డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. ఆ సమయంలో వాష్‌రూమ్ వాడుకుంటాననే నెపంతో ఆమె వద్దని వారిస్తున్నప్పటికీ, బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తిస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శించాడు. 

Also Read: POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు

ఇంట్లోకి రావడమే తప్పు అంటే.. అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ బాధితురాలు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, చాలా పెద్ద తప్పు చేశావు అని ఆమె ఈ తతంగాన్ని రికార్డు చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. టాయిలెట్ నెపం అనేది కేవలం ఇంట్లోకి చొరబడటానికేనని, ఇది ఒక వికృత మనస్తత్వంతో ముందస్తుగా ప్లాన్ చేసి చేసిన దుశ్చర్య అని బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆమె మారతహళ్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

కర్ణాటకలో పెరుగుతున్న ఇలాంటి ఘటనలు

ఐటీ హబ్ అయిన బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రధాన నగరాల్లో డెలివరీ ఏజెంట్లు, ఈ-కామర్స్ సిబ్బంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గతంలో బెంగళూరులోనే ఒక ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ఏజెంట్, ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత మహిళకు అసభ్యకరంగా వాట్సాప్ సందేశాలు పంపడం తెలిసిందే. మరికొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని, తలుపు తీయగానే లోపలికి చొరబడటానికి ప్రయత్నించిన ఘటనలు ఉన్నాయి. ఈ రకమైన ప్రవర్తనతో ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళల భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. కంపెనీలు తమ సిబ్బందికి సరైన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు విమర్శిస్తున్నారు.

Also Read: Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!

మహిళల భద్రత - తీసుకోవలసిన జాగ్రత్తలు 
ఇలాంటి వికృత చేష్టల నుండి రక్షణ పొందడానికి మహిళలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంట్లోకి రానివ్వకూడదు
డెలివరీ ఏజెంట్లు లేదా అపరిచిత వ్యక్తులు వాష్‌రూమ్ కావాలనో, తాగునీరు కావాలనో అడిగితే నమ్మి ఇంట్లోకి రానివ్వడం ప్రమాదకరం.

డోర్ వద్దే పార్సిల్స్
 ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు డోర్ పూర్తిగా తెరవకుండా, సేఫ్టీ గ్రిల్స్ లేదా డోర్ చైన్‌లు వాడుతూ పార్సిల్‌ను బయటే తీసుకోవడం వారికి సురక్షితం.

అత్యవసర సహాయం
ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తక్షణ సహాయం కోసం జాతీయ అత్యవసర సంఖ్య 112 లేదా మహిళల ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 181 కి కాల్ చేయాలి. కర్ణాటకలో ఉండే వారు స్థానిక పోలీసుల అత్యవసర సేవల యాప్‌లను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget