అన్వేషించండి

POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు

Hyderabad POCSO Case | కుషాయిగూడలో ఇద్దరు ఇంటర్ బాలికలను కిడ్నాప్ చేసిన అజయ్ ఉప్పాల అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కుషాయిగూడలో జూలై 1న ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.
  • బంధువు అజయ్ తీసుకెళ్లారని అనుమానంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు.
  • పోలీసులు సాంకేతికతతో వారి ఆచూకీ కనుగొని, అజయ్‌ను అరెస్ట్.
  • బాలికల వాంగ్మూలంతో కేసు పోక్సోగా మారి, రిమాండ్ కు తరలింపు.

Missing Inter Girls Missing Case | హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం అయింది. దాదాపు 10 రోజులపాటు శ్రమించిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదై రిమాండ్‌కు తరలించారు.

కాలేజీకి వెళ్లిన విద్యార్థిని మిస్సింగ్..

కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 1వ తేదీన ఉదయం కాలేజీకి వెళ్లిన ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న ఒక విద్యార్థిని క్లాసులకు హాజరు కాలేదని యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాల పరిసర ప్రాంతాల్లో, స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదేరోజు మరో బాలిక, యువకుడు మిస్సింగ్..

కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో ఆరా తీయగా, అదేరోజు వారి బంధువైన మరొక బాలిక కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలిసి షాకయ్యారు. అదే సమయంలో వారికి బంధువైన అజయ్ ఉప్పాల (24) అనే యువకుడు కూడా డ్యూటీకి వెళ్లిన తర్వాత తిరిగి రాకపోవడం, అతడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌ చేసినట్లు గ్రహించారు. అంతేకాకుండా, కుషాయిగూడలోని ఒక జూనియర్ కాలేజీ వెనుక అజయ్ బైక్ పార్క్ చేసి ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, ఆ ఇద్దరు బాలికలను అజయ్ తీసుకువెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు క్రైమ్ నెం. 493/2026, సెక్షన్ 137(2) BNS కింద కేసు నమోదు చేశారు.

Also Read: Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!

కేసును వేగంగా దర్యాప్తు చేసిన కుషాయిగూడ పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడి మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారి ఆచూకీని కనుగొన్నారు. రక్షించిన ఇద్దరు మైనర్ బాలికల నుంచి వివరాలు సేకరించి, వారి స్టేట్‌మెంట్స్ ఆధారంగా కేసును పోక్సో (POCSO) చట్టం కిందకు మార్చారు. మైనర్ బాలికలను ప్రలోభపెట్టి తీసుకువెళ్లిన నిందితుడు అజయ్ ఉప్పాలను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు తీర్పుతో నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.

 

Frequently Asked Questions

కుషాయిగూడలో తప్పిపోయిన బాలికల కేసు ఎలా ముగిసింది?

కుషాయిగూడలో తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికల కేసు సుఖాంతమైంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో నిందితుడు ఎవరు?

ఈ కేసులో నిందితుడు అజయ్ ఉప్పాల (24). అతను తప్పిపోయిన బాలికలకు బంధువు.

పోలీసులు బాలికలను మరియు నిందితుడిని ఎలా కనుగొన్నారు?

పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడి మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారి ఆచూకీని విజయవంతంగా కనుగొన్నారు.

ఈ కేసు పోక్సో చట్టం కిందకు ఎందుకు మార్చబడింది?

రక్షించబడిన బాలికల నుండి సేకరించిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా, నిందితుడు బాలికలను ప్రలోభపెట్టినట్లు గుర్తించి పోలీసులు కేసును పోక్సో చట్టం కిందకు మార్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget