News
News
X

Bahubali Samosa : సమోసా తింటే బిల్లు కట్టక్కర్లేదు పైగా రూ. 51 వేలిస్తారు - ట్రై చేస్తారా ?

పుడ్ కాంపిటిషన్లు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ఫుడ్ కాంపిటిషన్ మాత్రం భిన్నం. ఒక్కటి..ఒక్కటంటే ఒక్క సమోసా తింటే రూ. యాభై ఒక్క వేలిస్తారు. ఓస్ అంతేనా అనుకోవద్దు.. అంత తేలిగ్గా తినేదయితే ఎందుకు కాంపిటిషన్ ఉంటుంది ?

FOLLOW US: 

Bahubali Samosa :  సమోసాలు అంటే మనకు తెలిసింది అనియన్ సమోసా. ఇలాంటివి నాలుగైదు ఈజీగా లాగించేయవచ్చు. ఇది కాదు అనుకుంటే ఆలూ సమోసా ఉంటుంది. అవి రెండు తింటే ఓ పూటభోజనం తిన్నట్లే. అంత కంటే పెద్ద సమోసాలు ఎక్కడా చూసి ఉండం. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వ్యాపారి ఎనిమిది కేజీల బరువుంటే సమోసా తయారు చేశాడు. అలాంటి సమోసా ఎవరూ కొనరు కదా.. అతను కాడా అమ్మడానికి కొనలేదు. దానికి బాహుబలి సమోసా అని పేరు పెట్టి ప్రదర్శనకు పెట్టాడు. పోటీ కూడా పెట్టాడు. ఈ సమోసాను అరగంటలో తింటే... దానికి బిల్లు కట్టక్కర్లేదని... పైగా తానే రూ. 51 వేలు ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు.

ఆయుర్వేదంపై అధ్యయనం చేయండి, ఎన్‌ఈపీతో అద్భుత అవకాశాలు - ప్రధాని మోదీ

తన దుకాణానికి ఏదైనా ప్రత్యేకత ఉండాలని శుభం అనే వ్యాపారి ఈ భారీ సమోసా తయారు చేశాడు. దానికి బాహుబలి సమోసా అని పేరు పెట్టాడు. ఈ సమోసాలో ఆలూ, బఠానీలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు. సమోసా తయారీకి రూ. 1100 ఖర్చు అయిందని వ్యాపారి చెబుతున్నారు. అయితే ట్రై చేసి మొత్తం తినకపోతే సమోసాకు బిల్లు కట్టాలి. చాలా మంది ట్రై చేశారని కానీ ఎవరూ తినలేకపోయారని శుభం చెబుతున్నారు. 

శుభం ఎవరూ అంత పెద్ద సమోసాను తినే బాహుబలి రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఎవరైనా వచ్చి చాలెంజ్‌ను స్వీకరించి సమోసా తింటే రూ. యాభై ఒక్క వేలు ఇద్దామని అనుకుంటున్నాడు. తర్వాత పది కేజీల సమోసా చేద్దామనుకుంటున్నాడు. కానీ ఇంత వరకూ ఎవరూ తినలేకపోయారు. అందుకే.. మరికొంత ప్రచారం వస్తే ఎక్కువ మంది వస్తారని లోకల్ మీడియాకు సమాచారం ఇచ్చాడు.

గోధుమ పిండినీ ఎక్స్‌పోర్ట్ చేయటానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

ఈ న్యూస్ వైరల్ అయింది. దీంతో శుభం దుకాణానికి వచ్చే వారు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు అతనికి రెండు విధాలుగా లాభం కలుగుతోంది. ఒకటి దుకాణానికి గిరాకీ.. మరో విధంగా ఆ సమోసా అమ్మకం. మొత్తానికి శుభం లాంటి వ్యాపారులు వినూత్న ఐడియాలు అమలు చేస్తేనే ఇలాంటి కాంపిటిషన్లు కూడా వెలుగులోకి వస్తాయి.   ఈ బాహుబలి సమోసాని ట్రై చేయాలంటే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వెళ్లాల్సిందే. 

Published at : 08 Jul 2022 06:49 PM (IST) Tags: Baahubali Samosa Samosa Eating Contest Samosa Rs. 51 thousand Meerut News

సంబంధిత కథనాలు

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

Noida Twin Towers : 40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం ! నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చబోతున్నారో తెలుసా ?

Noida Twin Towers :   40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం ! నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చబోతున్నారో తెలుసా ?

Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని

Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!