Amit Shah In Bengal: CAA అమలుపై అమిత్ షా క్లారిటీ- బంగాల్ సీఎం దీదీ కౌంటర్
Amit Shah In Bengal: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు.
Amit Shah In Bengal: పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమల్లోకి రాబోదని తృణమూల్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ముగిసిన వెంటనే ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం బంగాల్ సిలిగురిలో జరిగిన 'పశ్చిమ్ బంగో సమ్మాన్ సమావేశ్'లో ఆయన మాట్లాడారు.
#WATCH TMC is spreading rumours about CAA that it won't be implemented on ground, but I would like to say that we'll implement CAA on ground the moment Covid wave ends...Mamata Didi wants infiltration...CAA was, is & will be a reality:Union Home minister Amit Shah in Siliguri, WB pic.twitter.com/E1rYvN9bHM
— ANI (@ANI) May 5, 2022
దీదీ కౌంటర్
అమిత్‌షా వ్యాఖ్యలకు బంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. బంగాల్ గురించి అమిత్ షాకు ఎలాంటి బెంగా అవసరం లేదని దిల్లీ జహంగీర్‌పురీ, యూపీ, మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న వ్యవహారాలపై ఆయన దృష్టి నిలిపాలని హితవు పలికారు.
Also Read: Prashant Kishor Political Party: జగన్ బాటలో ప్రశాంత్ కిశోర్- 3వేల కిమీ పాదయాత్ర, ఆ తర్వాతే అన్నీ!