అన్వేషించండి

Vijay Rupani DNA Tests: విజయ్ రూపానీ భౌతికకాయం గుర్తింపు, సాయంత్రమే ఫ్యామిలీకి అప్పగింత- కొనసాగుతోన్న DNA టెస్టులు

విజయ్ రూపాని విమాన ప్రమాదంలో మరణించారు. DNA పరీక్ష ద్వారా నిర్ధారించారు. నేడు సాయంత్రం కుటుంబానికి మృతదేహాన్ని అప్పగిస్తారు.

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారని తెలిసిందే. నిపుణులు చేస్తున్న డిఎన్ఏ పరీక్షలో విజయ్ రూపానీ డెబ్ బాడీ మ్యాచ్ అయింది. ఈ విషయాన్ని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి వెల్లడించారు. డిఎన్ఏ టెస్టుల్లో డాక్టర్లు విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారని ధృవీకరించారు. ఆదివారం (జూన్ 15) సాయంత్రం విజయ్ రూపానీ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఎయిరిండియా విమానం కూలిపోయింది. విజయ్ రూపానీ సహా విమానంలో 241 మంది చనిపోయారు. బ్రిటన్ పౌరసత్వం ఉన్న భారత్ కు చెందిన రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

 

 

హోం మంత్రి హర్ష్ సంఘ్వి ధృవీకరించారు
ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చనిపోవడం బాధాకరం అన్నారు హోం మంత్రి హర్ష్ సంఘ్వి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, "గుజరాత్‌ ప్రజల కోసం తన జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించిన నేత విజయ్ రూపానీ. అంకిత భావం కలిగిన నేత. అహ్మదాబాద్ నుంచి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. మృతదేహాలు చాలా వరకు కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. ప్రభుత్వం ప్రయాణికుల కుటుంబసభ్యుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించింది. వాటిని డెడ్ బాడీలతో మ్యాచ్ చేస్తుండగా విజయ్ రూపానీ డీఎన్ఏ మ్యాచ్ అయింది. ఆదివారం ఉదయం 11:10 గంటలకు విజయ్ రూపానీ DNA ధృవీకరించారని’ చెప్పారు. అంతకుముందు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ.. చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తోందని ఆయన తెలిపారు.

ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో తేలిన DNA 
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 250 మందికి పైగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తల బృందం తక్షణ సహాయక చర్యలు మొదలుపెట్టాయి. బీజే మెడికల్ కాలేజీలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తుండగా.. విమానంలోని ప్రయాణికుల మృతదేహాలు బాగా కాలిపోయయాయి. మరణించిన వారిని గుర్తించడానికి ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో DNA నమూనాలను సరిపోల్చే పని జరుగుతోంది’ అని డాక్టర్ రాకేష్ జోషి చెప్పారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Protest:ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget