Agnipath Scheme Protests India: 7 రాష్ట్రాల్లో అగ్నిపథ్ నిరసన జ్వాలలు- బిహార్ డిప్యూటీ సీఎం ఇంటికి నిప్పు
Agnipath Scheme Protests India: ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, తెలంగాణ ఇలా 7 రాష్ట్రాలకు అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలు వ్యాపించాయి.
Agnipath Scheme Protests India: త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు పనిచేసేందుకు సైనికుల నియామకానికి కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదలైన ఈ నిరసన జ్వాలలు తాజాగా మరిన్ని రాష్ట్రాలకు వ్యాపించాయి.
7 రాష్ట్రాల్లో
- తెలంగాణ, బిహార్, మధ్యప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీలలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. సికింద్రాబాద్, బిహార్‌లలో పలుచోట్ల నిరసనకారులు రైళ్లను తగలబెట్టారు. మరికొన్ని చోట్ల బస్సు అద్ధాలను ధ్వంసం చేశారు.
#WATCH | Bihar: Trains burnt and damaged, cycles, benches, bikes, and stalls thrown on railway tracks amid the ongoing agitation against the recently announced #AgnipathRecruitmentScheme
— ANI (@ANI) June 17, 2022
(Visuals from Danapur Railway Station, Patna district) pic.twitter.com/JBOnCihIoZ
- బిహార్‌లో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణు దేవి ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. పశ్చిమ చంపారాన్ జిల్లాలోని ఆమె ఇంటికి నిప్పంటించారు
- బిహార్‌లో అనేక ప్రాంతాల్లో యువత రైలు పట్టాలపై బైఠాయించారు. ట్రాకులు ధ్వంసం చేశారు. కొన్ని రైళ్లను తగలబెట్టారు. అనేక ప్రధానమైన రహదారులను దిగ్బంధించారు.
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మూడు రైళ్లను, 40 బైకులను తగులబెట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు మృతి చెందాడు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయమే బల్లియా రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టిన ఆందోళనకారులు ఓ రైలుకి నిప్పంటించారు. రైల్వే స్టేషన్ ఆస్తులను ధ్వంసం చేశారు.
- భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, హరియాణాల్లోనూ తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగాయి.
#WATCH | Haryana: Police chased away protesters who were agitating in Narnaul against #AgnipathRecruitmentScheme. Protest was also held at Hero Honda Chowk. pic.twitter.com/RPeu02mO0Y
— ANI (@ANI) June 17, 2022
- బంగాల్‌లోని సిలిగురిలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.
Also Read: Agneepath Scheme: ఈ దేశాల్లోనూ అగ్నిపథ్ తరహా పథకం, అక్కడ ఎలా అమలు చేస్తున్నారో తెలుసా