అన్వేషించండి

Aditya-L1 Mission: లగ్రాంజ్ పాయింట్‌ అంటే ఏంటి? ఆదిత్య మిషన్‌ అక్కడే ఎందుకు?

Aditya-L1 Mission: లగ్రాంజ్ పాయింట్ నుంచి సూర్యుడు క్లియర్‌గా కనిపిస్తాడనే ఉద్దేశంతో ఆదిత్య మిషన్‌ని ఇక్కడే చేపడుతున్నారు.

ఈ విశ్వంలో ఏ రెండు ఖగోళ వస్తువులకు మధ్య అయినా గ్రావిటేషనల్ ఇంకా సెంట్రిఫ్యూగల్ ఫోర్సేస్ అనేవి ఉంటాయి. అంటే రెండు ఖగోళ వస్తువులు తీసుకున్నామనుకోండి. ఉదాహరణకు భూమి అనే గ్రహం, సూర్యుడు అనే నక్షత్రాన్ని తీసుకున్నాం అనుకుందాం. భూమిని తన వైపు లాక్కోవటానికి సూర్యుడు ప్రయత్నిస్తుంటే..సూర్యుడి నుంచి తప్పించుకోవటానికి భూమి ప్రయత్నిస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరగటం వలన సూర్యుడిలోపలికి జారిపోకుండా భూమి తనను తాను రక్షించుకోగలుగుతుంది. ఈ ప్రాసెస్ లో సూర్యూడి చుట్టూ ఇలా ఓ కక్ష్యలో భూమి తిరుగుతుంది కదా. ఈ కక్ష్యలో ఓ ఐదు పాయింట్లను గుర్తించారు మన శాస్త్రవేత్తలు. వీటినే లగ్రాంజ్ పాయింట్స్ అంటారు. L1, L2, L3, L4, L5 అని పిలుస్తారు ఈ ఐదు పాయింట్లను. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త లగ్రాంజ్ 1772లో ఈ థియరీని పబ్లిష్ చేశారు కాబట్టి ఆయన పేరు మీదుగానే వీటిని లగ్రాంజ్ పాయింట్స్ అంటారు.ఇప్పుడు ఈ పాయింట్స్ ప్రత్యేకత ఏంటో మాట్లాడుకుందాం.

L1 పాయింట్ అంటే...

ముందుగా L1 పాయింట్. అంటే లగ్రాంజ్ పాయింట్ 1 తీసుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఏదైనా వస్తువు పెడితే దాని మీద సూర్యుడి, భూమి గురుత్వాకర్షణ బలం సరిగ్గా సమానంగా ఉంటుంది. ఈ పాయింట్ కి చేరుకోవాలంటే భూమి నుంచి సూర్యుడి దిశగా 15లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో ఈ పాయింట్ లో కనుక ఉంటే గ్రహణాల సమస్య ఉండదు. సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తూ పరిశోధనలు చేసుకోవచ్చు అందుకే L1 పాయింట్ నే ఆదిత్య L1లో టార్గెట్ చేశారు. ఇక్కడికే మన ఉపగ్రహాన్ని పంపించి సూర్యుడి మీద నిరంతారయంగా పరిశోధనలు చేయిస్తారు. ఇక్కడికి చేరుకోవటానికి ఆదిత్య L1 కు సుమారు నాలుగు నెలల సమయం పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ నాసా వాళ్లు పంపిన డిస్కవర్ అనే శాటిలైట్ ఉంది. అది అడ్డుగా నిలబడి ఎప్పుడూ భూమి మీదకు వచ్చే సూర్యకాంతి ని ఫోటోలు తీసి ఆ మార్పుల మీద అధ్యయనాలు చేస్తూ ఉంటోంది.

L2 పాయింట్ అంటే...

ఇదే ఆర్బిట్ లో భూమి వెనుకగా ఉండే సెంట్రిఫ్యూగల్ పాయింట్ ఇది. సరిగ్గా ఎల్1 పాయింట్ ఏ స్ట్రైట్ లైన్ మీద ఉందో అదే స్ట్రైట్ లైన్ మీద భూమి వెనుక వైపు ఉంటుంది ఈ పాయింట్.  ఈ పాయింట్ ప్రత్యేకత ఏంటంటే సూర్యుడి కిరణాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ అంటే దాదాపు ఈ పాయింట్ లో ఎప్పుడూ సూర్యగ్రహణంలా ఉంటుంది అనుకోవచ్చు. పైగా భూమి, చంద్రుడు నుంచి వచ్చే కాంతి ఇక్కడ పడదు. అందుకనే నాసా జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోపులను ఈ పాయింట్ లో ప్రవేశపెట్టింది. ఇక్కడ నుంచి సూర్యకాంతి వల్ల డిస్ట్రబ్ కాకుండా సూదూర ప్రాంతంలో ఉన్న గెలాక్సీలను, గ్రహాలను పరిశీలించగలదు నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్.

L3 పాయింట్ అంటే
L2 ఎలా అయితే భూమి వెనుక స్ట్రైట్ లైన్ లో ఉంటుందో. అదే స్ట్రైట్ లైన్ లో సూర్యుడి వెనుకాల ఉండే సెంట్రిఫ్యూగల్ పాయింట్ ఇది. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎలాంటి స్పేస్ క్రాఫ్ట్స్ లేవు. బట్ నాసా ఆలోచిస్తుంది. ఎప్పుడూ సూర్యుడు అడ్డుగా ఉండే ఈ పాయింట్ లో ఏమన్నా స్పేస్ క్రాఫ్ట్ పెట్టి చూద్దామా అని.

L1 అంటే భూమికి సూర్యుడికి మధ్యలో పాయింట్. L2 అంటే భూమి వెనుకనున్న పాయింట్, l3 అంటే సూర్యుడి వెనుకనున్న పాయింట్ అని చెప్పుకుందాం. ఇప్పుడు l4 అండ్ l5 పాయింట్స్ అంటే భూమికి, దాని L1 పాయింట్ కి ఇటు త్రిభుజాకారంలో l4 పాయింట్ ఉంటే...భూమికి, దాని l1 పాయింట్ కు అటు త్రిభుజాకారంలో వచ్చే పాయింట్ l5. ఈ రెండు పాయింట్స్ చాలా స్పెషల్ ఏంటంటే మిగిలిన పాయింట్స్ అటూ ఇటూ మార్పులు ఉంటూ ఉంటాయి. భూమి, సూర్యుడు తిరుగుతున్న విధానాలను బట్టి..కానీ l4, l5 లలో గ్రావిటీ పాయింట్ స్టేబుల్ గా ఉంటుంది. సరిగ్గా అదే పాయింట్ అని మనం ముందే లెక్కగట్టేయొచ్చు అన్నమాట. అంత స్టేబుల్ గా ఉంటుంది. అందుకే ఇక్కడ ఫ్యూచర్ లో ఎర్త్ స్టేషన్లు కట్టుకోవాలని అన్ని స్పేస్ ఏజెన్సీస్ ఆలోచిస్తున్నాయి. పైగా ఈ పాయింట్స్ కు వచ్చిన ఏ ఖగోళ వస్తువులైనా తమ చుట్టూ తిప్పుకోగల బలం ఉంటుంది ఈ పాయింట్స్ కి. ఇప్పుడు మనం సూర్యుడు, భూమి మధ్య ఈ ఐదు ఎల్ పాయింట్స్ చెప్పుకున్నాం కదా. ఇవి కేవలం వీటికే ఉండవు. ప్రతీ గ్రహానికి, వాటి చందమామాలకు మధ్య కూడా ఈ ఐదు పాయింట్స్ ఉంటాయి. అంటే భూమికి, చంద్రుడి మధ్య కూడా l1,l2,l3,l4,l5 ఉంటాయి. అలాగే జ్యూపిటర్ లాంటి భారీ గ్రహాలకు , సూర్యుడికి మధ్య కూడా ఈ ఐదు పాయింట్లు ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు భూమికి ,సూర్యుడికి మధ్య పాయింట్లలో L1 ను టార్గెట్ చేసి అక్కడకు ఆదిత్య L1 ఉపగ్రహాన్ని పంపించటం ద్వారా సూర్యుడి మీద నిరంతం ప్రయోగాలు చేయాలని చూస్తుందన్నమాట ఇస్రో.

Also Read: మోదీ సర్కార్ జమిలిపై ఏ నమ్మకంతో ముందుకెళ్తోంది? లా కమిషన్ ఏం చెప్పింది?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget