ABP Network Cameraman Injured: అమృత్‌సర్ ఎన్‌కౌంటర్ కవర్ చేస్తుండగా ABP కెమెరామెన్‌కు బుల్లెట్ గాయం
ABP Network Cameraman Injured: పంజాబ్ అమృత్‌సర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ కవర్ చేస్తుండా ABP నెట్‌వర్క్ కెమెరామెన్‌కు గాయాలయ్యాయి.
ABP Network Cameraman Injured: పంజాబ్ అమృత్‌సర్ సమీపంలో జులై 20న భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంగ్రెస్ నేత, సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధమున్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లను పోలీసులు హతమార్చారు. ఈ ఎన్‌కౌంటర్‌ను కవర్ చేయడానికి వెళ్లిన ABP కెమెరామెన్‌కు గాయాలయ్యాయి.
సికందర్ మట్టు
ఇండియా-పాకిస్థాన్ సరిహద్దులోని భక్నా గ్రామంలో దాదాపు 5 గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ సాగింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ను కవర్ చేసేందుకు అక్కడికి వెళ్లిన ABP నెట్‌వర్క్ కెమెరామెన్ సికిందర్ మట్టుకు బుల్లెట్ గాయమైంది. సికిందర్ కుడి మోకాలి కింద బుల్లెట్ తగిలింది. ఏకే-47 తుపాకీకి సంబంధించిన బుల్లెట్ పార్ట్ అతనికి తగిలింది.
గాయం తగిలిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి సికందర్‌ను అమృత్‌సర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేసి ఆ బుల్లెట్‌ను తొలిగించారు వైద్యులు.
ప్రాణాలకు తెగించి
ABP సాంజా సీనియర్ కరస్పాడెంట్ గగన్‌దీప్ శర్మ, కెమెరామెన్ సికందర్ మట్టు ప్రాణాలకు తెగించి ఈ ఎన్‌కౌంటర్‌ను కవర్ చేశారు. దాదాపు 3 గంటల పాటు ఎన్‌కౌంటర్ ప్లేస్ నుంచి వీళ్లు రిపోర్టింగ్ చేశారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో జగ్రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్ అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లు మృతి చెందారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో వీళ్లు వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు.
Also Read: Punjab Encounter: పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్- సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి
Also Read: African Swine Fever In Kerala: కేరళకు ఏమైంది? తాజాగా మరో వ్యాధి - 300 పందులను చంపేయాలని ఆదేశం!