మిజోరంలో మళ్లీ MNFదే అధికారం! అంచనా వేసిన ABP CVoter ఒపీనియన్ పోల్
ABP C Voter Opinion Poll: మిజోరంలో అధికార MNF పార్టీకే మరోసారి ప్రజలు పట్టం కడతారని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.
ABP C Voter Opinion Poll:
మళ్లీ MNFకే అధికారం..?
మిజోరం ఎన్నికల ట్రెండ్‌ని అంచనా వేసింది ABP CVoter Opinion Poll. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మిత్రపక్షమైన మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) 13-17 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 10-14 సీట్ల మేర గెలుచుకుంటుందని తెలిపింది. మిజోరంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో MNF కి 26 సీట్లు వచ్చాయి. ఈ సారి అవి 15 సీట్లకు పడిపోయే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే..గత ఎన్నికల్లో 5 సీట్లు మాత్రమే దక్కించుకుంది. ఈ సారి కాస్త పుంజుకుని 12 సీట్లు గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. Zoram People's Movement (ZPM) పార్టీ గత ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది. ఈ సారి మూడు సీట్లు అదనంగా గెలుచుకుంటుందని తెలిపింది పోల్. ఇతరులకు 2 స్థానాలు దక్కనున్నాయి. మొత్తంగా చూస్తే...అధికారంలో ఉన్న MNFకి 13-17, కాంగ్రెస్‌కి 10-14, ZPM 9-13 స్థానాలు వస్తాయని వెల్లడించింది.
ఓట్ల శాతం పరంగా చూస్తే...గత ఎన్నికల్లో MNFకి 37.7% ఓట్లు పోల్ అయ్యాయి. ఈ సారి ఇది తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. 30.5%కి పడిపోతుందని ఒపీనియ్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ విషయానికొస్తే...గత ఎన్నికల్లో 29.9% ఓట్లు పోల్ అయ్యాయి. ఈ సారి అది 28.3%కి పడిపోయింది. ZPMకి గత ఎన్నికల్లో 22.9% ఓట్లు రాగా...ఈ సారి 27.1%కి పడిపోనుంది. ఇతరులకు 14.2% ఓట్లు పోల్ అయ్యే అవకాశాలున్నాయి.
మిజోరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది. ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఎంఎన్ఎఫ్కు 26 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎంఎన్ఎఫ్కు 65 శాతం ఓట్లు దక్కాయి. మిజోరంలో మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 21. ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.
[Disclaimer: Current survey findings and projections are based on CVoter Pre Poll personal interviews (Face to Face) conducted among 18+ adults statewide, all confirmed voters (sample size 11,928). The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval. ]