Mumbaikars No Cooking gas : దేశ ఆర్థిక రాజధానిలో కట్టెల పొయ్యిలే ఆధారం - కారణం ఏమిటంటే ?
ముంబైలో గ్యాస్ సౌకర్యం లేని కుటుంబాలు 21 శాతం ఉన్నట్లుగా తేలింది. చాలా మంది గ్యాస్ కనెక్షన్ ఉన్నా కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నారు.
ముంబై అంటే మహానగరం. అక్కడ గ్యాస్, కరెంట్ సౌకర్యం లేని వాళ్లు ఎవరూ ఉండరని అనుకుంటారు. ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు పెట్టి చిటారు కొమ్మన ఉంటున్న వారికి కూడా గ్యాస్ అందిస్తున్నామని ప్రకటించుకుంటూ ఉంటాయి. కానీ వాస్తవానికి సిటీల్లో జీవించే వారికే గ్యాస్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబైలో 21 శాతం కుటుంబానికి వంట గ్యాస్ సౌకర్యం లేదు. "ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్" సేకరించిన డేటాలో ఈ విషయం స్పష్టమయింది.
మహిళల వివాహ వయసు పెంచొద్దు - 95 శాతం మంది అభిప్రాయం ఇదేనా !?
ముంబైలో నిరుపేదలు ఎక్కువ మందే ఉంటారు. శివారు కాలనీల్లో ఉంటారు. వారు ఇప్పటికీ కట్టెల పొయ్యినే వాడుతూంటారు. ఇలాంటి పొయ్యిల వల్ల ఇండోర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మహిళల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. చాలా మందికి కనెక్షన్లు తీసుకోవడం దుర్భరం అయితే.. మరికొంత మంది ధర పెట్టి కొనుగోలు చేయడం కష్టమవుతోంది. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా కట్టెల పొయ్యిలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సిలిండర్ ధర రూ.వెయ్యి దాటించేసింది. దీంతో గ్యాస్ కొనలేక కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు సామాన్యులు.
గుజరాత్ కాంగ్రెస్‌లో హార్దిక్ కల్లోలం - పార్టీ మారబోవడం లేదన్న పటేల్ నేత !
ముంబైలో ఉంటూ వంటచెరకును సేకరించుకోవడం కష్టమే. అయితే దాని కోసం వారు సమయం కేటాయిస్తున్నారు. గ్యాస్ అనేది లగ్జరీగా మారిందని అక్కడి జనం అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో కేంద్రం ఇచ్చే సబ్సిడీ కూడా పూర్తిగా తగ్గించేసింది. రూ. ఇరవై, ముప్ఫై కూడా సబ్సిడీ ఇవ్వడం లేదు. ఈ కారణంగా గ్యాస్ నుంచి కట్టెల పొయ్యి వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారు. గతంలో గ్యాస్ వాడిన వారు కూడా ఈ బాట పడుతూండటంతో మళ్లీ మహిళల ఆరోగ్యం పొగచూరిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జలియన్‌వాలా బాగ్ - బ్రిటిష్ క్రూర పాలనలో ఓ మర్చిపోలేని రోజు !
ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్" డేటాలో ఇంకా ఎన్నో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 85 శాతం మందికి టీవీ సౌకర్యం ఉంది. అరవై ఒక్క శాతం మందికి సెల్ ఫోన్ ఉంది. పర్సనల్ కంప్యూటర్ మాత్రం కేవలం ఇరవై శాతం మందికే ఉంది. ముంబై దేశ ఆర్థిక రాజధాని. దేశంలో అత్యంత కుబేరులైన అంబానీ అక్కడే ఉంటారు. అత్యంత నిరుపేదలూ అక్కడే నివసిస్తూ ఉంటారు.