Samruddhi Express Highway: తెల్లవారుజామున ఘోరం- 16 మంది దుర్మరణం
మహారాష్ట్రలో మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని షాపూర్లో.. భారీ క్రేన్ (గర్డర్) ఒక్కసారిగా కుప్పకూలి 16 మంది మృత్యువాత పడ్డారు.
మహారాష్ట్రలో మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని షాపూర్లో.. భారీ క్రేన్ (గర్డర్) ఒక్కసారిగా కుప్పకూలి 16 మంది మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వంతెనలు తయారు చేసేందుకు వాడే ఉపయోగించే గడ్డర్ క్రేన్ కులిపోవడంతో ప్రమాదం జరిగింది. సంవృద్ధి ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మిణంలో భాగంగా మూడో దశ పనులు జరుగుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థంలో మరో ఐదుగురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
దీనిపై అధికారులు వివరాలు వెల్లడించారు. ‘షాపూర్లోని సర్లంబె గ్రామానికి సమీపంలోని గర్డర్ కూలి 16 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సంవృద్ధి ఎక్స్ప్రెస్వే మూడో ఫేజ్ పనులు జరుగుతుండా.. ఈ ఘటన చోటుచేసుకుంది. గర్డర్‌ను ఆపరేట్ చేస్తుండగా.. అది ఒక్కసారిగా కుప్పకూలింది. 16 మంది చనిపోయారు’ అని వెల్లడించారు.
భారీ నిర్మణాల్లో గడ్డర్లను ఉపయోగిస్తారు. భారీ ఇనుప రాడ్లు, బీమ్‌లను కదిపేందుకు వీటిని వాడుతుంటారు. హైవే నిర్మాణాలు, రైల్వే బ్రిడ్‌లను రూపొందించడం వీటి పాత్ర కీలకంగా ఉంటుంది. షాపూర్లోని సర్లంబె గ్రామానికి సమీపంలో సంవృద్ధి ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మిణంలో వీటిని ఉపయోగిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున కూలీలు పనిచేసుకుంటుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీనిపై ఎన్డీఆర్‌ఎఫ్ ప్రకటన విడుదల చేసింది. ‘మొత్తం 16 మంది మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురు శిథిలాల్లో చిక్కుకున్నారు.’ అని తెలిపింది.
తాము గడ్డర్‌కు మరో వైపు పనిచేస్తున్నామని, ఘటన జరిగిన సమయంలో అక్కడ 30 మంది వరకూ పనిచేస్తున్నారని, వారిలో చాలా మందికి బలమైన గాయాలు అయ్యాయని, కాళ్లు, చేతులు, తలపై దెబ్బలు తగిలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ సంవృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవేని ముంబై- నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే అని కూడా పిలుస్తుంటరు. రెండు నగరాలను కలిపేందుకు ఇది కీలకంగా మారనుంది. నాగ్‌పూర్-షిరిడీని కలుపుతూ గత ఏడాది తొలి దశ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోడ్డును ప్రారంభించారు.