అన్వేషించండి

TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు

Lok Sabha చాలా ఏళ్ల విరామం అనంతరం లోక్ సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరుగనుంది. దీంతో ఆయా పార్టీలు తమ తమ ఎంపీలకు తమ స్టాండుకు అనుకూలంగా ఓటేసేందుకు తప్పక లోక్‌సభకు హాజరు కావాలంటూ విప్ జారీ చేశాయి.

ఇంకా పూర్తి స్థాయిలో కొలువుదీరకుండానే 18వ లోక్‌సభ కాకరేపుతోంది. స్పీకర పదవి కోసం అధికార విపక్షాలు పోటీ పడుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ విషయంలో స్పష్టత రాకపోవడంతో ఇండీ కూటమి ఏకంగా స్పీకర్ పదవి కోసం పోటీ పడుతోంది. ఎన్డేఏ కూటమి తరఫున బీజేపీ ఎంపీ ఓం బిర్లా నామినేషన్ వేయగా... ఆఖరి నిమిషంలో ఇండీ కూటమి తరఫున కే. సురష్‌ నామినేషన్ వేశారు. దీంతో స్పీకర్ పదవి కోసం పోటీ అనివార్యమైంది. సుదీర్ఘ కాలం తర్వాత లోక్ సభ స్పీకర్ పదవికి ఇవాళ(బుధవారం) ఎన్నిక జరుగనుంది. దీంతో ఆయా పార్టీలు తమ తమ ఎంపీలకు తమ స్టాండుకు అనుకూలంగా ఓటేసేందుకు తప్పక లోక్‌సభకు హాజరు కావాలంటూ విప్ జారీ చేశాయి. 

1976 తరువాత ఇదే

స్వాతంత్య్రానికి ముందు స్పీకర్ పోస్టుకు ఎన్నిక తప్పనిసరిగా జరిగేది. అయితే స్వతంత్రం వచ్చాక  ఇప్పటి వరకూ కేవలం మూడు సార్లే స్పీకర్  పదవికి అభ్యర్థులు పోటీ పడటం జరిగింది. 1952, 1967, 1976 సంవత్సరాల్లో మాత్రమే ఇప్పటి వరకూ లోక్ సభ స్పీకర్ కు పోటీ నెలకొన్న పరిస్థితులున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే ఎన్నిక కావడంతో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది. 1976 తరువాత ఇదే తొలిసారి ఇలాంటి ఎన్నిక జరుగుతోంది. 

టీడీపీ విప్ 

లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. బుధవారం లోక్ సభకు 11 గంటల కల్లా ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని,  ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలని లోక్ సభలో టీడీపీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి కోరారు.  అంతకు ముందే  ఉదయం 9.30 గంటలకు లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలో టీడీపీ ఎంపీల సమావేశం జరుగనుంది. దీంట్లో స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు.  ఏపీ బీజేపీ, జనసేన ఎంపీలను కూడా లావు నివాసంలోజరిగే సమావేశానికి టీడీపీ ఆహ్వానించింది.  

బీజేపీ, కాంగ్రెస్ సైతం

లోక్ సభ స్పీకర్ పోస్టుకు ఎన్నిక జరుగున్న వేళ బీజేపీ మంగళవారం తన పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. బుధవారం జరిగే ఎన్నిక కోసం  ఉదయం 11 గంటల కల్లా తమ పార్టీ ఎంపీలు తప్పక లోక్ సభకు హాజరు కావాలని ఆ విప్‌లో పేర్కొంది.  మరోవైపు కాంగ్రెస్ సైతం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. బుధవారం 12 గంటల వరకు లోక్ సభలో తప్పక హాజరు కావాలని కోరింది. చాలా ముఖ్యమైన ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు అంతా.. తప్పకుండా లోక్ సభకు హాజరవ్వాలని, లోక్ సభ సెషన్ పూర్తయ్యే వరకు సభలోనే ఉండాలని విప్ లో కోరింది. పార్టీ స్టాండ్ కు సపోర్టు చేయాలని సూచించింది. కాంగ్రెస్ చీఫ్ విప్ కే. సురేష్ ఈ మేరకు పార్టీ ఎంపీలను కోరారు. 

డిప్యూటీ ఇవ్వనన్నారని.. 

లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్‌డీఏ తరఫు అభ్యర్థి ఓం బిర్లా తో పాటు ఇండి కూటమి అభ్యర్థి కె. సురేష్ సైతం పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. తొలుత బీజేపీ ఎంపీ ఓం బిర్లాను స్పీకర్ పదవికి అధికార పక్షం ప్రతిపాదించింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని ఇండి కూటమి తరుఫున రాహుల్ గాంధీ ప్రతిపాదించినా దానికి అధికార ఎన్డీఏ కూటమి అంగీకరించలేదు. దీంతో ఇండి కూటమి తమ స్పీకర్ అభ్యర్థిగా కే. సురేష్ ని ప్రకటించింది. దీంతో ఎన్డీఏ కూటమి తమ తరఫున ఎంపీ ఓం బిర్లా స్పీకర్ పోటీలో ఉంటారని పేర్కొంది. దీంతో బుధవారం  స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget