అన్వేషించండి

CAA: 8 నెలల్లో 1,739 మంది విదేశీయులకు భారత పౌరసత్వం- సీఏఏ చట్టం కింద మంజూరు

CAA: 8 నెలల్లో 1,739 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

CAA: గత ఏడాది 1,739 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 1, 2022 నుంచి డిసెంబర్ 31, 2022 వరకు తొమ్మిది రాష్ట్రాలు, 31 జిల్లాల్లో విదేశీయులకు పౌరసత్వం మంజూరు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీఏఏ చట్టం కింద వీరందరికి పౌరసత్వం ఇచ్చామంది. 

మొత్తం 1739 మందికి పౌరసత్వం ఇవ్వగా.. ఇందులో 1386 మందికి సెక్షన్ 5 కింద పౌరసత్వం ఇచ్చామని, మిగతా 353 మందికి పౌరసత్వ చట్టం-1955 సెక్షన్ 6 ద్వారా పౌరసత్వం ఇచ్చినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 8(2) ప్రకారం భారతీయ పౌరసత్వం పునరుద్ధరించేందుకు దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ను డిసెంబర్8, 2022న ప్రారంభించారు. పౌరసత్వ దరఖాస్తులు అక్టోబర్ 15, 2019న పూర్తిగా పేపర్‌లెస్‌ గా మార్చినట్లు.. ఎండ్ టు ఎండ్ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్‌గానే జరుగుతున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA)-2019.. డిసెంబర్ 12, 2019న నోటిఫై చేశారు. జనవరి 10, 2020 నుంచి అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 31, 2014లోగా భారత్ కు వలస వచ్చిన, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు ఈ చట్టం వర్తిస్తుంది. తమ దేశాల్లో మతపరమైన వేధింపులకు గురైన వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు. ఇతర దేశాలకు చెందిన వారికి, ఈ మూడు దేశాలు సహా, ఏ దేశం నుంచైన వలస వచ్చిన ముస్లింలకు ఈ చట్టం వర్తించదు. భారత్ లో ఆశ్రయం పొందిన విదేశీయులకు 11 ఏళ్లు దాటితే పౌరసత్వం ఇచ్చేవారు. వీరి విషయంలో దాన్ని ఐదేళ్లకు తగ్గించారు. 

పౌరసత్వ సవరణ చట్టం భారతీయులకు వర్తించదు. భారతీయులు తమ పౌరసత్వం కోల్పోవడం కోసం ఈ చట్టం చేయలేదు. పొరుగున ఉన్న మూడు దేశాల్లో మతపరంగా హింసను ఎదుర్కొంటున్న కొందరికి భారత పౌరసత్వం ఇవ్వడం కోసమే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) రూపొందించారు.

ఈశాన్య ప్రాంతంలోని గిరిజన, ఆదివాసీలకు రక్షణ కల్పించేందుకు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ లో ప్రత్యేక నిబంధనలు రూపొందంచారు. సీఏఏ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ లోని ప్రాంతాలను, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ కింద ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను మినహాయించింది. దీని వల్ల ఈశాన్య రాష్ట్రాల స్థానిక జనాభాకు రాజ్యాంగం మంజూరు చేసిన రక్షణను సీఏఏ ప్రభావితం చేయదు.

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget