NSA-Level Meet:'అఫ్గాన్'పై కీలక భేటీకి ఒప్పు కున్న రష్యా.. తప్పుకున్న పాక్.. కిక్కురుమనని చైనా!
అఫ్గానిస్థాన్ అంశంపై చర్చించేందుకు భారత్ నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది.
అఫ్గానిస్థాన్ అంశంపై చర్చించేందుకు భారత్ నేతృత్వంలో నవంబర్ 10న ఓ భద్రతా సమావేశం జరగనుంది. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) స్థాయిలో ఈ చర్చ జరగనున్నట్లు సమాచారం.
ఈ చర్చలో పాల్గొనేందుకు భారత్.. రష్యా, ఇరాన్, చైనా, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారులను అధికారికంగా ఆహ్వానించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. భారత్ ఆహ్వానాన్ని పలు దేశాలు పాజిటివ్‌గా స్పందించాయి. రష్యా, ఇరాన్ సహా పలు దేశాలు సమావేశానికి హాజరుకానున్నట్లు స్పష్టం చేశాయి.
అయితే భారత్ నేతృత్వం వహిస్తోన్న కారణంగా ఈ సమావేశానికి హాజరుకాబోమని పాకిస్థాన్ తెలిపింది.
పాకిస్థాన్‌ను పక్కన పెడితే చైనా ఇంకా భారత్ ఆహ్వానంపై స్పందించలేదు. ఇలాంటి ప్రాంతీయ భద్రతా సమావేశాలు 2018 సెప్టెంబర్, 2019 డిసెంబర్‌లో జరిగాయి. భారత్‌లో జరగాల్సిన ఈ సమావేశం కరోనా కారణంగా జరగలేదు.
Also Read: Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ కొనసాగింపు.. రాజీనామా ఉపసంహరణ
Also Read: Zika Virus Kanpur: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ