Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ కొనసాగింపు.. రాజీనామా ఉపసంహరణ
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిలో తాను కొనసాగుతున్నట్లు నవజోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు.
పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు నవజోత్ సింగ్ సిద్ధూ.
సెప్టెంబర్ 28న చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని కొత్త కేబినెట్ ఏర్పాటై శాఖలను కేటాయిస్తున్న సమయంలో సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే పలు దఫాల చర్చల తర్వాత అక్టోబర్ 15న అప్పటి పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జ్ హరీశ్ రావత్ కీలక ప్రకటన చేశారు. సిద్ధూ పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగుతారని తెలిపారు. సిద్ధూ కూడా ఆ ప్రకటనకు సానుకూలంగా స్పందించారు.
సోనియాకు లేఖ...
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ లేఖ రాశారు. ఈ నెల 15న సోనియా గాంధీకి రాసిన నాలుగు పేజీల లేఖలోని వివరాలను సిద్ధూ ఈ రోజు ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 13 పాయింట్ల ఎజెండాతో కూడిన పంజాబ్ మోడల్‌ను రూపొందించానని, దానిని వివరించేందుకు తనకు సమయం కేటాయించాలని ఆ లేఖలో సోనియాను సిద్ధూ కోరారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ సింగ్ చన్నీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన ప్రాధాన్యతా క్రమాలను ఆ లేఖలో సిద్ధూ ప్రస్తావించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పునరుద్ధరణకు ఇది చివరి అవకాశంగా పేర్కొన్నారు.
Also Read: Zika Virus Kanpur: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ
Also Read: PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. శంకరాచార్యుని విగ్రహం ఆవిష్కరణ
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి