Chinese Journalist Jailed: ఇవేం పనులయ్యా జిన్ పింగ్.. చావుబతుకుల్లో జర్నలిస్ట్.. ప్రశ్నిస్తే చంపేస్తారా?
కరోనా పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ నగరంలో పరిస్థితులను ప్రశ్నించిన ఓ చైనా జర్నిలిస్టు ప్రస్తుతం చావుబతుకుల్లో ఉన్నారు.
చైనా ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందుకు చాలానే ఉదాహరణలున్నాయి. కరోనా వచ్చిన కొత్తలో వుహాన్ నగరంలో పరిస్థితులను ప్రశ్నించిన ఓ జర్నిలిస్టు పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆమె చావుబతుకుల్లో ఉన్నారు.
ఎవరామె?
చైనాకు చెందిన ఝాంగ్ జాన్ (38) ఓ జర్నలిస్టు. అంతకుముందు ఆమె న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2020లో వుహాన్ నగరంలో కరోనా పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసినందకు, వార్తలు రాసినందుకు ఆమెను జిన్‌పింగ్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. రెచ్చగొట్టే చర్యల ద్వారా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆరోపణలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.
ఝాంగ్ జాన్ ఆరోగ్యం బాగోలేదని.. ఎక్కువకాలం బతకరంటూ.. ఇక విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని ఆమె కుటుంబం అభ్యర్థిస్తోంది. ఈ మేరకు ఆమె సోదరుడు ఓ ట్వీట్ చేశారు.
మానవహక్కుల సంఘాలు..
ఝాంగ్ జాన్ సోదరుడి ట్వీట్‌తో అక్కడి హక్కుల సంఘాలు ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా చైనా ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. ఆమె ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తుందని, ఝాంగ్ జాన్‌కు వైద్యం చాలా అవసరమని ఆమ్నెస్టీ తెలిపింది. కనీసం ఆమెను కలిసేందుకు కుటుంబానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
Also Read: Zika Virus Kanpur: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ
Also Read: PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. శంకరాచార్యుని విగ్రహం ఆవిష్కరణ
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ