Mumbai Cruise Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు నుంచి వాంఖడే ఔట్
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తోన్న అధికారి సమీర్ వాంఖడేను ఇన్వెస్టిగేషన్ నుంచి ఎన్‌సీబీ తొలగించిందియ.
ముంబయి డ్రగ్స్ కేసులో కీలక అప్‌డేట్ వచ్చింది. అధికారి సమీర్ వాంఖడేను డ్రగ్స్ కేసును దర్యాప్తు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్‌సీబీ ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసులో వాంఖడే పెద్ద ఎత్తున లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు కూడా జరుగుతోంది.
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కూడా వాంఖడేపై వరుస ఆరోపణలు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో సాక్షిగా పేర్కొంటోన్న ప్రభాకర్ సాలీ కూడా వాంఖడేపై ఆరోపణలు చేశాడు.
సమీర్ వాంఖడే ప్రస్తుతం దిల్లీ ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చి రిపోర్ట్ చేయాలి. అనంతరం ముంబయి జోనల్ డైరెక్టర్‌గా సంజయ్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
వాంగ్మూలం రికార్డ్..
ఎన్‌సీబీ సీనియర్ అధికారైన సమీర్ వాంఖడే వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు ఇటీవల రికార్డ్ చేశారు. అనంతరం ఎన్‌సీబీ నియమించిన ఐదుగురు దర్యాప్తు కమిటీలో ఒకరైన డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే అంతకుముందే ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్‌సీబీ ఆఫీసు నుంచి కీలక డాక్యుమెంట్లు, రికార్డింగ్‌లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
" వాంఖడే వాంగ్మూలాన్ని మేం రికార్డు చేసుకున్నాం. ఇది చాలా కీలకమైన దర్యాప్తు, కనుక ఇప్పుడే అన్ని విషయాలను బహిర్గతం చేయలేం. దర్యాప్తును ప్రారంభించాం. సాక్షులను ఒక్కొక్కరిగా పిలిచి వాంగ్మూలాలు రికార్డ్ చేస్తాం. "
Also Read: Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ కొనసాగింపు.. రాజీనామా ఉపసంహరణ
Also Read: Zika Virus Kanpur: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ