Covid Cases: దేశంలో కొత్తగా 6,093 కరోనా కేసులు నమోదు
Covid Cases: దేశంలో కొత్తగా 6 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
Covid Cases: దేశంలో కొత్తగా 6,093 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,768 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
India reports 6,093 new COVID19 cases today, active cases at 49,636 pic.twitter.com/533uuP9Dx0
— ANI (@ANI) September 9, 2022
- మొత్తం కేసులు: 4,44,72,241
- యాక్టివ్ కేసులు: 49,636
- మొత్తం మరణాలు: 5,28,121
- మొత్తం రికవరీలు: 4,39,06,972
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 28,09,189 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 214.55 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,16,504 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కీలక నిర్ణయం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్ టీకా (బీబీవి154/నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు.
ఒక్కసారి చాలు
భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను 'BBV154'గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: Queen Elizabeth Death: క్వీన్ ఎలిజబెత్ 2 గురించి ఈ 10 షాకింగ్ విషయాలు తెలుసా?