అన్వేషించండి
Advertisement
Queen Elizabeth Death: క్వీన్ ఎలిజబెత్ 2 గురించి ఈ 10 షాకింగ్ విషయాలు తెలుసా?
Queen Elizabeth Death: క్వీన్ ఎలిజబెత్ 2 గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
Queen Elizabeth Death: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ విషయాన్ని బకింగ్‌హమ్ ప్యాలెస్ వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు. రాణి ఎలిజబెత్ 2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఆసక్తికర విషయాలు
- బ్రిటీష్ హెరిటేజ్ ప్రకారం.. రాణి తన వివాహ దుస్తులకు సంబంధించిన వస్తువులను WWII రేషన్ కూపన్‌లను ఉపయోగించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత విరాళాలు ఇచ్చిన మహిళలకు ఆ సొమ్మును తిరిగి ఇచ్చారు.
- రాణి ఎలిజబెత్ మొదటి గుర్రాన్ని 'పెగ్గి' అని పిలుస్తారు. ఆమె తాత కింగ్ జార్జ్ V.. రాణికి తన మొదటి గుర్రాన్ని ఇచ్చారు.
- క్వీన్‌కు.. కోర్గిస్ జాతి శునకాలంటే చాలా ప్రేమ. అయితే ఆమె తన జీవితంలో 30కి పైగా ఈ శునకాలను పెంచారట. "క్వీన్ అద్భుతమైన డాగ్ ట్రైనర్" అని క్వీన్స్ మాజీ కోర్గిస్ ట్రైనర్ రోజర్ మగ్‌ఫోర్డ్ గతంలో తెలిపారు.
- ఇంగ్లాండ్‌లో రహదారులపై డ్రైవింగ్ చేయడానికి క్వీన్‌కు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ సౌలభ్యం క్వీన్‌కు మాత్రమే ఉంది.
- 1936లో ఆమె తండ్రి రాజు అయిన తర్వాత, ప్రిన్సెస్ ఎలిజబెత్ రాజ్యాంగ చరిత్ర, చట్టాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఆమె ఇంట్లో నుంచే ఫ్రెంచ్, జర్మన్, సంగీతాన్ని కూడా అభ్యసించారు.
- రాణి తన ట్యూటర్, గవర్నెస్ అయిన మారియన్ క్రాఫోర్డ్ నుంచి చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఫ్రెంచ్ భాష నేర్చుకున్నారు. ఫ్రాన్స్‌ను సందర్శించిన ప్రతిసారీ ఫ్రెంచ్ భాషలోనే ఆమె మాట్లాడతారట.
- అధికారిక రాయల్ ఫ్యామిలీ వెబ్‌సైట్ ప్రకారం, క్వీన్ ఎలిజబెత్ 2కు ముందు ఏ బ్రిటిష్ చక్రవర్తి కూడా ఆమె చేసినన్ని ప్రయాణాలు చేయలేదు. కామన్వెల్త్ దేశాల్లోనే ఆమె తన హయాంలో 150కి పైగా సందర్శనలు చేశారు.
- ఆమె క్వీన్ కావడానికి ముందు రెండవ ప్రపంచ యుద్ధంలో ట్రక్ డ్రైవర్, మెకానిక్‌గా స్వచ్ఛందంగా పనిచేశారు. దీంతో సైన్యంలో పనిచేసిన రాజకుటుంబానికి చెందిన తొలి మహిళా సభ్యురాలుగా ఆమె గుర్తింపు పొందారు.
- రేడియో,టెలివిజన్ ప్రసారాలు చేయడంలో క్వీన్ పెట్టింది పేరు. అయితే ఆమె 14 సంవత్సరాల వయస్సులోనే తొలిసారి రేడియోలో మాట్లాడారు.
- రాణి తన పాలనలో 100 దేశాలకు పైగా పర్యటించారు. ఆమె కెనడాకు 22 సార్లు, ఫ్రాన్స్‌కు 13 సార్లు వెళ్లారు.
Also Read: Queen Elizabeth: బ్రిటన్ రాజవంశీకులకు ఆ ఆకారాల్లోని ఆహారమంటే చాలా భయమట, ఎందుకంటే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement