By: ABP Desam | Updated at : 04 Feb 2022 08:47 AM (IST)
Edited By: harithac
(Image credit: Wikimedia)
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యులకు ఇప్పటికీ ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు చాలా ఎక్కువ. అనేక ప్రోటోకాల్‌ల మధ్య వారి జీవితం గడిచిపోతుంది. ఆహారం విషయంలో కూడా ప్రోటోకాల్ అమలులో ఉంది. ఆ ప్రోటోకాల్ లోబడే వారు జీవించాలి. ధిక్కరించడం కుదరదు. ఇక క్వీన్ ఎలిజబెత్ 2కు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. కొన్ని ఆకారాల్లోని ఆహారాలను వారు తినడానికి ఇష్టపడరు. వారి వంటశాలలో ఆ ఆహారాలు కనిపించవు.
బ్రిటిష్ రాజవంశీకుల వద్ద వంటగాడిగా పనిచేసి రిటైర్ అయిన చెఫ్ గ్రాహం న్యూబౌల్డ్ పలు విషయాలను పంచుకున్నారు. ఎలిజబెత్ రాణికి చతురస్రాకారంలో ఉన్న, చివర్లు కోణం ఆకారంలో (పాయింట్ ఎడ్జ్) ఉన్న ఆహారాలు నచ్చువు. ఎప్పుడూ వాటిని తినరు. అందుకే శాండ్ విచ్‌లు రాజప్రసాదంలో కనిపించాలి. రాజవంశీకులకు చతురస్రాకార ఆహారాన్ని, చివర్లు సూదిగా ఉన్న ఆహారానలు తింటే ఇంగ్లాండ్ సింహాసనాన్ని పడగొట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారనే అనే భావన కలుగుతుంది. అందుకే వాటి జోలికి పోరు. అలాగే శవపేటిక ఆకారంలో ఉన్న ఆహారాన్ని కూడా తినరు. క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్డ్ అలాంటి ఆకారంలో ఉన్న ఆహారాన్ని తినడం వల్ల దురదృష్టకరమని నమ్మేవారని సమాచారం.
బ్రిటన్ రాణి ఏం తింటారు?
బ్రిటన్ మహారాణి తన రోజును ఎర్ల్ గ్రే టీతో ప్రారంభిస్తుంది. ఆ టీతో పాటూ కొన్ని బిస్కెట్లను తింటుంది. ఇక అల్పాహారంగా టోస్ట్, పెరుగు, సెరీల్, మార్మాలాడ్‌లను ఇష్టపడుతుంది. ‘డిన్నర్ ఎట్ బకింగ్‌హామ్ ప్యాలెస్’ అనే పుస్తకంగా రాణికి బ్రేక్ ఫాస్ట్ లో చేపలు తినడం చాలా ఇష్టమని రాశారు. మధ్యాహ్నభోజనంలో పాలకూర, కీరాదోస జాతికి చెందిన కోర్జెట్లు, చేపలు తింటారు. ఇక రాత్రి పూట మాత్రం రాణి వేటమాంసంతో వండిన వంటకాలను తింటారు. మష్రూమ్ విస్కీ సాస్‌ను ఇష్టపడతారు. డార్క చాక్లెట్ అంటే ఆమెకి చాలా ఇష్టం. వరల్డ్ ఫేమస్ పిజ్జాను ఇంతవరకు తినలేదట. ఆమె తన పర్సును తీసి టేబుల్ పై పెట్టిందంటే ఆమె డిన్నర్ ను ముగించినట్టు అర్థమట. అది ఆమె పనివారికి ఇచ్చే సిగ్నల్ గా భావిస్తారు.
రాజవంశీకులకు డిన్నర్ టేబుల్ దగ్గర చాలా నిమయాలు ఎక్కువ. ఏ ఆహారాన్ని ఫోర్క్ తో గట్టిగా పొడవకూడదు. చిన్నగా గుచ్చి మెల్లగా తీసి తినాలి. వెల్లుల్లిని వంటల్లో వాడరు. ప్రిన్స్ విలియం భోజనప్రియుడు. అతడొక్కడే ఆన్ లైన్లో ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుంటారు. అది కూడా ఉబెర్ ఈట్స్ లో అధికంగా ఆర్డర్ చేస్తారంట. డెలివరీ బాయ్‌కు భారీగానే టిప్ అందుతుందేమో.
Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!
Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!