Rahul Gandhi Speech: 'న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్ మీ ఆయుధాలు..' రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యాయవ్యవస్థ, పెగాసస్, ఎన్నికల సంఘం వంటి ఆయుధాలతో రాష్ట్రాలు, ప్రజల గొంతును కేంద్రం నొక్కిపెడుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు.
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల సంఘం,పెగాసస్, న్యాయవ్యవస్థ వంటి ఆయుధాలతో రాష్ట్రాల గళాన్ని కేంద్రం నొక్కిపెడుతోందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల ప్రస్తావనే లేదన్నారు రాహుల్.
#WATCH | "The Judiciary, the Election Commission, Pegasus, these are all instruments of destroying the voice of the union of states," says Congress MP Rahul Gandhi in Lok Sabha pic.twitter.com/BQzxXf9VM7
— ANI (@ANI) February 2, 2022
ఆ ఇద్దరినీ మీరు కలిపారు..
వీటితో పాటు చైనా, పాకిస్థాన్ గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. తాము ఏం చేస్తున్నాం, ఏం చేయాలనేదానిపై చైనాకు ఓ స్పష్టత ఉందని రాహుల్ అన్నారు. చైనా, పాకిస్థాన్ దేశాల మధ్య దూరం పెరిగేలా చూడటమే భారత విదేశాంగ విధానాల్లో ప్రధానమైనదని రాహుల్ అన్నారు.
Also Read: TMC in Lok Sabha Polls: మోదీని గద్దె దించేందుకు దీదీ ప్లాన్.. 2024 ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ!
Also Read: UP Election 2022: యూపీ మాజీ మంత్రులు మౌర్య, అభిషేక్ మిశ్రాకు టికెట్లు ఇచ్చిన ఎస్పీ