అన్వేషించండి

IIT BABA: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా ఐఐటీ బాబా - ఐదంకెల జీతం, కార్పొరేట్ జీవితం వదులుకొని మరీ..

Mahakumbh Mela 2025: మహా కుంభమేళాకు హాజరైన నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆహార్యం, పద్ధతులతో ఆకట్టుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఐఐటీ బాబా వైరల్‌గా మారారు.

IIT BABA In Mahakymbh Mela 2025: భూ మండలంపైనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంబరం మహా కుంభమేళా(Kumbh Mela)కు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. సాధువులు, నాగసాధువులు, సాధారణ భక్తులతో ప్రయాగ్‌రాజ్‌(Prayagaraj) ప్రాంతంలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. 13 అఖాడాలకు చెందిన నాగసాధువులు మహా కుంభమేళాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అత్యంత నిష్ఠ, నియమాలతో నిత్యం దైవ స్మరణలో ఉండే సాధువులను చూస్తే నిరక్షరాస్యులేమో అనిపిస్తుంది. కానీ ఈ అఖాడాలకు చెందిన సాధువుల్లో అత్యధికులు విద్యాధికులే. ఇంజినీరింగ్‌, వైద్య విద్య, మాస్టర్స్‌ చేసిన వారూ  ఉన్నారు. పెద్ద పెద్ద సంస్థల్లో లక్షలాది జీతాలు తీసుకుంటూ వాటన్నింటినీ త్యజించి నాగసాధువులుగా మారిన సన్యాసులూ ఉన్నారు.  వీరిలో ఐఐటీ బాబాగా ఖ్యాతి పొందిన అభేయ్‌సింగ్‌(Abhay Singh) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. 

అభేయ్‌సింగ్ నేపథ్యం
హరియాణా(Hariyana)కు చెందిన అభేయసింగ్‌ ఉన్నత చదువులు చదివాడు. ఐఐటీ - బాంబే(IIT-Bomby)లో ఏకంగా ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే మంచి ఉద్యోగం కైవసం చేసుకుని ఓ కార్పొరేట్ సంస్థలో పని చేశాడు. ఫొటోగ్రఫీపై మక్కువతో తొలుత కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత  చిన్నగా ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూతో ఆయన ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యారు. నెటిజన్లు ఆయన్ను ఐఐటీ బాబా(IIT BABA), ఇంజినీర్‌ బాబాగా పిలుస్తున్నారు. నిజానికి అభేయ్‌సింగ్‌... ఐఐటీలో చదువుకునే రోజుల్లోనే ఫిలాసఫీ వైపు ఆకర్షితుడయ్యాడు. చాలా ఫిలాసఫీ కోర్సులు చదవడంతో పాటు సోక్రటీస్‌, ప్లేటోలనూ పూర్తిగా  చదివేశాడు. శివుడిని అమితంగా ఆరాధించే ఈ ఐఐటీ బాబా.. తన జీవితంలో ఇదే అత్యుత్తమ దశగా అభివర్ణించారు. సైన్స్‌ ద్వారా ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపారు.

హర్ష్‌ రిచారియా

మహా కుంభమేళాలో ఎంతోమంది సాధువులు ఉన్నా  ఓ మహిళ మాత్రం  ప్రధాన ఆకర్షణగా  నిలుస్తున్నారు. ఉత్తరాఖడ్‌కు చెందిన హర్ష్‌ రిచారియా.. తన సంప్రదాయ వస్త్రధారణ, తిలకం, రుద్రాక్ష మాలతో ప్రత్యేకంగా  కనిపిస్తున్నారు. వీడియోలు, ఇంటర్వూలతో ఆమె వైరల్‌గా మారారు. కుంభమేళాకు వచ్చిన వారంతా ఆమెను మహా సాధ్వీగా పిలుస్తుండగా.. ఆమె మాత్రం సున్నితంగా వారిస్తున్నారు. తాను సాధ్వీని కాదని, కేవలం మంత్రాలు మాత్రమే జపిస్తుంటాని తెలిపారు.

వీరితో పాటు మరికొంతమంది సాధువులు ఆకర్షణగా నిలుస్తున్నారు. తమ ఆహార్యం, పద్ధతులతో భక్తులను ఆకట్టుంటున్నారు. గంగాపురి మహరాజ్‌ 32 ఏళ్లుగా స్నానమే చేయలేదు. 9 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు మరణించడంతో... ఒక రోజు అకస్మాత్తుగా ఇక స్నానం చేయనని ప్రమాణం చేసినట్లు గంగాపురి మహారాజ్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాధేపురి మహారాజ్‌ అనే సాధువు 14 ఏళ్లుగా పైకెత్తిన చేయి కిందకు దించలేదు. అలాగే ఆవాహన్ అఖారా కార్యదర్శిగా ఉన్న మహంత్ గీతానంద్ గిరి 45 కిలోల బరువున్న 1.25 లక్షల రుద్రాక్ష పూసల తలపాగా ధరించి మహా కుంభమేళాకు హాజరయ్యారు. వీరితో పాటు చాలామంది ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత కూడా అవన్నీ వదులుకుని సాధువులుగా మారిపోతున్నారు. ఇక్కడ ఉన్న మనశ్శాంతి ఎందులోనూ లేదని... ఆధ్యాత్మిక జీవన విధానమే అత్యుత్తమమైనదని నమ్మి సన్యాసం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అఖాడాలు మాత్రం వీరికి వెంటనే సన్యాసం ఇవ్వడం లేదు. ముందుగా వారిని సాధారణ జీవితమే గడపాలని నచ్చజెబుతున్నామని.. కానీ వారి పట్టుదల, కార్యసిద్ధి, నిష్ఠ పరిశీలించన తర్వాతే సన్యాసం ఇస్తున్నట్లు తెలిపాయి.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget