By: Ram Manohar | Updated at : 05 Feb 2023 10:57 AM (IST)
హైదరాబాద్‌పై ఉగ్రదాడికి కుట్ర జరిగినట్టు NIA విచారణలో తేలింది.
Hyderabad Terror Case:
NIA విచారణ
హైదరాబాద్‌పై దాడికి కుట్ర జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన Lone Wolf Attack సంస్థ ఈ దాడికి ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. హైదరాబాద్‌లో ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన NIA అధికారులు విచారణ జరిపారు. అయితే ఈ కుట్ర వెనకాల ISI,లష్కరేతోయిబా కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రసంస్థలతో అరెస్ట్ అయిన ఉగ్రవాది జహీద్‌కు సంబంధాలున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. పాక్ నుంచి అతడికి హ్యాండ్ గ్రనేడ్‌లు కూడా సప్లై చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఉగ్రవాది మరి కొందరిని రిక్రూట్ చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది. ఏదైనా ర్యాలీని కానీ...జనం ఎక్కువగా ఉన్న పబ్లిక్ ప్లేస్‌లో కానీ దాడులు చేయాలని చూశారు ముష్కరులు. మత కల్లోలాలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నాల్ని NIA అడ్డుకుంది. అరెస్ట్ అయిన ఉగ్రవాది నుంచి 2 హ్యాండ్ గ్రనేడ్స్‌తో పాటు రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ జహీద్‌ను 2005లో అరెస్ట్ చేశారు. ఆత్మాహుతి దాడి ఘటనలో అతని హస్తం ఉందని అదుపులోకి తీసుకున్నా..సరైన ఆధారాలు లభించకపోవడం వల్ల 2017లో విడుదల చేశారు. పాక్ నుంచి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పలు చోట్ల దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్టు విచారణలో చెప్పాడు జహీద్. గతేడాది అక్టోబర్ 2న కూడా హైదరాబాద్ పోలీసులు ముగ్గురు ముష్కరులను అరెస్ట్ చేశారు. బహిరంగ సభల్లో గ్రనేడ్‌లతో దాడులు చేయాలని కుట్ర చేయగా...ఆ ప్లాన్ అమలు చేయకుండా అడ్డుకున్నారు.
ముంబయిలోనూ..
ముంబయిలో మరో ఉగ్రదాడికి కుట్ర జరగనున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. NIAకి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన వెంటనే... ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులతో పాటు మిగతా దర్యాప్తు సంస్థలూ దీనిపై విచారణ చేపడుతున్నాయి. NIA మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తి తనను తాను "తాలిబన్"గా చెప్పుకున్నాడు. సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాల మేరకుముంబయిలో మరోసారి ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టు బెదిరించాడు. తాలిబన్ ఆర్గనైజేషన్‌లో కీలక వ్యక్తి...సిరాజుద్దీన్. అయితే...ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అని విచారిస్తున్నారు పోలీసులు. ముంబయిలోనే కాకుండా...దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ భద్రత పెంచారు. అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ గ్రూప్ హెడ్ సిరాజుద్దీన్‌ది చాలా పెద్ద నెట్‌వర్క్. తాలిబన్‌లలో నెంబర్ 2 పొజిషన్ ఇతనిదే. హక్కానీ జాడ చెప్పిన వాళ్లకు అమెరికా 10 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడే కాదు. ముంబయికి ఇలాంటి బెదిరింపులు జనవరిలోనూ వచ్చాయి. కంట్రోల్ రూమ్‌కి ఓ వ్యక్తి కాల్ చేసి సిటీలోని చాలా చోట్లు బాంబు దాడులు చేస్తామని హెచ్చరించాడు. మరో రెండు నెలల్లో బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచే భద్రత పెంచిన పోలీసులు...ఇప్పుడు మరింత కట్టుదిట్టం చేశారు. అయోధ్య రామ మందిరాన్ని పేల్చే కుట్ర జరిగే ప్రమాదముందని ఇటీవలే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలతో పోలీసులూ అలెర్ట్ అయ్యారు. భారీ భద్రత నడుమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరోసారి అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. రామ జన్మభూమి స్థలాన్ని పూర్తిగా పేల్చి వేస్తామంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పడం సంచలనమవుతోంది.
Also Read: China Spy Balloon: చైనా స్పై బెలూన్‌ను పేల్చేసిన అమెరికా, వీడియో వైరల్ - డ్రాగన్ అసహనం
Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు
ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్
Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాలపై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్
Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్లో సరికొత్త రికార్డ్!
CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్