China Spy Balloon: చైనా స్పై బెలూన్ను పేల్చేసిన అమెరికా, వీడియో వైరల్ - డ్రాగన్ అసహనం
China Spy Balloon: చైనా స్పై బెలూన్ను అమెరికా షూట్ చేసింది.
China Spy Balloon Shot Down:
సింగిల్ మిజైల్‌తో...
కొద్ది రోజులుగా అమెరికా ఎయిర్ బేస్‌లో చక్కర్లు కొడుతున్న చైనా స్పై బెలూన్ను షూట్ చేసేసింది అగ్రరాజ్యం. దాదాపు మూడు బస్సుల సైజ్ ఉన్న ఈ భారీ బెలూన్ను Fighter Jet F-22 షూట్ చేసింది. సింగిల్ మిజైల్‌తో ఆ బెలూన్ పేలిపోయింది. రక్షణ పరంగా సున్నితమైన ప్రాంతాలను, వ్యూహాత్మక ప్రదేశాలపై నిఘా పెడుతున్న చైనా స్పై బెలూన్ను కాల్చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బెలూన్ను పేల్చివేయడంపై తీవ్ర అసహనంతో ఉంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
"విజయవంతంగా ఆ స్పై బెలూన్ను పేల్చివేశాం. ఈ పని ఇంత సక్సెస్‌ఫుల్‌గా చేసిన ఫైటర్ జెట్ పైలట్లకు నా అభినందనలు"
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఈ బెలూన్ను బ్లాస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే ఒక మిజైల్ వచ్చి నేరుగా బెలూన్ను తాకింది. ఆ వెంటనే ఆ బెలూన్ పేలిపోయింది.
Incredible HD footage of the Chinese surveillance balloon being shot down. pic.twitter.com/K1GxdcJuH1
— Graham Allen (@GrahamAllen_1) February 4, 2023
అమెరికాలో చైనా స్పై బెలూన్ కొద్ది రోజులుగా కలకలం సృష్టిస్తోంది. అలెర్ట్ అయిన అగ్రరాజ్యం...సెన్సిటివ్ ఎయిర్ బేస్‌లు, స్ట్రాటెజిక్ మిజైల్స్ ఉన్న చోటే ఈ బెలూన్ ఎగురుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ స్పై బెలూన్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసింది అమెరికా. మిలిటరీలోని ఉన్నతాధికారులు ఈ బెలూన్ను కాల్చేయాలని ముందే భావించారు. అధ్యక్షుడు బైడెన్ కూడా ఇందుకు ఓకే అన్నారు. కానీ...ఇలా చేయడం వల్ల కింద ఉన్న వాళ్లకు ప్రమాదం తలెత్తే అవకాశముందని ఆలోచనలో పడ్డారు అధికారులు. చివరకు ఆ బెలూన్ను పేల్చేశారు. కేవలం తమపై నిఘా ఉంచేందుకే చైనా ఇలా స్పై బెలూన్ పంపిందని అమెరికా ఆరోపిస్తోంది. అంతే కాదు. ఈ బెలూన్ ఎగురుతున్న చోటే భూగర్భంలో న్యూక్లియర్ మిజైల్స్ కూడా ఉన్నాయని చెబుతోంది అగ్రరాజ్యం. అయితే...ఈ బెలూన్‌తో ప్రమాదమేమీ లేదని భావించినా ముందస్తు జాగ్రత్తగా పేల్చి వేసింది. యూఎస్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ మరి కొద్ది రోజుల్లోనే బీజింగ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ లోగా...స్పై బెలూన్ గాల్లో చక్కర్లు కొట్టడం సంచలనమైంది. నిజానికి కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. వాణిజ్యం విషయంలో రెండు దేశాల మధ్య దూరం, వైరం పెరిగిపోయింది. ముఖ్యంగా...తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని చైనా సహించడం లేదు. తైవాన్ ఆత్మరక్షణకు వీలుగా అమెరికా ఆయుధాలూ విక్రయిస్తుండటం డ్రాగన్‌కు చిరాకు తెప్పిస్తోంది. ఈ లోగా స్పై బెలూన్ వచ్చి వేడిని ఇంకాస్త పెంచింది. అమెరికా చర్యతో చైనా మండి పడుతోంది. బదులు చెబుతామని హెచ్చరిస్తోంది.
Also Read: Transgender Couple: తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట - అతడికి ఎనిమిదో నెల!