By: ABP Desam | Updated at : 04 Feb 2023 03:32 PM (IST)
Edited By: jyothi
తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట
Kerala Transgender Couple: దేశంలోనే తొలిసారి కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆశ్చర్యం ఎందుకంటే వీళ్లు బిడ్డను దత్తత తీసుకోవడమో, సరోగసి పద్దతిలోనే బిడ్డను కనడం లేదు. పురుషుడిగా మారిన ఓ మహిళ గర్భవతిగా మారి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం అతడిగా మారిన ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉంది. మరో నెలరోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మను ఇవ్వబోతుంది.
కేరళలోని కోజికోడ్‌లో నివసిస్తున్న ట్రాన్స్‌జెండర్ జంట త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. జహాద్ గా మారిన ఓ మహిళ... జియా పావల్ గా మారిన అతడితో మూడేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియా ద్వారా వారు తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తను నెటిజెన్లతో పంచుకున్నారు. ఈ జంట మార్చి నెలలో తమ బిడ్డను లోకానికి పరిచయం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
నేను త్వరలోనే తల్లి కాబోతున్నాను..!
పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన జియా పోస్ట్‌లో ఇలా రాశారు.. "నేను లేదా నా శరీరం పుట్టుకతో స్త్రీ కానప్పటికీ, ఒక బిడ్డ నన్ను అమ్మ అని పిలుస్తుంది, ఓ బిడ్డతో అమ్మా అని పిలిపించుకోవాలని నా కల" అని తెలిపింది. తామిద్దరూ కలిసి మూడేళ్లు అయిందని.. తాను తల్లి కావాలని ఎలా కలలు కంటానో, అదే విధంగా అతను (జహాద్) తండ్రి కావాలని కలలు కంటున్నాడని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తమ ఇద్దరి పూర్తి సమ్మతితో అతని కడుపులో ఎనిమిది నెలల జీవం ప్రాణం పోసుకుందని వివరించారు.
స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తర్వాత కూడా గర్భం.. ఎలా సాధ్యం?
ట్రాన్స్ జెండర్ల జంట తమ లింగాన్ని మార్చుకోవడానికి శస్త్ర చికిత్సను ఆశ్రయించారు. జియా పురుషుడిగా జన్మించగా.. స్త్రీగా మారాడు. అయితే జహాద్ స్త్రీగా జన్మించగా... తరువాత పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. కానీ ఈ సర్జరీలో అతని గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించలేదు. ఈ క్రమంలోనే అతడు గర్భవతి అయ్యాడు.
అభినందనల వెల్లువ..
ప్రెగ్నెన్సీ చిత్రాలపై ఇన్‌స్టా వినియోగదారులు ఈ జంటను తెగ అభినందిస్తున్నారు. జియా పావల్ పెట్టిన ఓ పోస్టుకు 19 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇలాంటి మరికొన్ని ఫొటోలను రెండు పోస్టుల్లో షేర్ చేయగా.. ఒక పోస్టుకు రెండు వేలకు పైగా లైకులు, మరో పోస్టుకు 1500కు పైగా లైకులు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ప్రతీ ఒక్కరూ తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. కంగ్రాట్స్ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా... ప్రేమకు అవధులు లేవని నిరూపించేందుకు నిదర్శనం ఈ జంట అని కామెంట్ చేశారు. మరో నెటిజెన్ "చాలా సంతోషంగా ఉంది.. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు" అని చెప్పారు.
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తినే తిండి కల్తీ చేశారో ఖబడ్దార్! ఆహార కల్తీ నియంత్రణకు GHMC స్పష్టమైన ఆదేశాలు
SSC Constable Posts: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్, పోస్టుల సంఖ్య 50,187కి పెంపు!
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !