Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
MrBeast: అమెరికా యూట్యూబ్ స్టార్ మిస్టర్ బీస్ట్ ఏకంగా ఓ కాలనీ కట్టేశారు. దాని కోసం రూ. 120 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో ఏం చేస్తారంటే వీడియోలు తీస్తాడట.
How MrBeast Spent 100 Million dollers On The Most Expensive Reality Show Ever: ప్రపంచంలో అత్యధిక మంది సబ్ స్క్రయిబర్లు ఉన్న యూట్యూబ్ చానల్ మిస్టర్ బీస్ట్. వ్యక్తిగత చానల్ ను మిస్టర్ బీస్ట్ ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఇంట్లో కూర్చుని వాళ్లపై.. వీళ్లపై సెటైర్లు వేస్తూ.. సెలబ్రిటిలను తిడుతూ.. రాజకీయ నేతలపై విమర్శలు చేస్తూ, సర్వేలు చెప్పడం.. ఫలితాలను విశ్లేషించడం వంటివి చేస్తూ మేధావిగా బిల్డప్ ఇస్తే ఈ సబ్‌స్కయిబర్లు రాలేదు. అయన గేమ్స్ ఆధారంగా కంటెంట్ క్రియేట్ చేస్తారు. రియాలిటీ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయన చానల్‌కు ప్రపంచంలో అత్యదిక మంది సబ్ స్క్రయిబర్లు ఉన్న చానల్ ఉంది.
తాజాగా మిస్టర్ బీస్ట్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే పని చేశారు. ఓ కాలనీని ఆయన నిర్మించేశారరు. ఇందు కోసం ఆయన వంద మిలియన్ డాలర్లు వెచ్చించారు. అంటే మన రూపాయల్లో 120 కోట్లు అనుకోవచ్చు. ఓ మాదిరి కాలనీని నిర్మించేశారు. ఇందులో ఆయన గేమ్స్ ఆడి.. ఆ వీడియోలను తన యూట్యూబ్ చానల్లో పెట్టుకుంటారు. అయితే వీడియో గేమ్స్ కాదు రియాలిటీ గేమ్స్. మిస్టర్ బీస్ట్ ఇలాంటి రియాలిటీ గేమ షోలతో ప్రపంచ యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే తన కెరీర్ లోనే కాదు.. ప్రపంచంలో ఎవరూ ఓ రియాలిటీ షోకు ఖర్చు పెట్టనంతగా ఖర్చు పెట్టి కాలనీ నిర్మించారు. తన రియాలిటీ షోలో గెలిచే వారికి ఐదు మిలియన్ల బహుమతి కూడా ఇస్తాడట.
We spent $14,000,000 building a city in a field for the contestants in Beast Games to live and compete in.. December 19th is almost here 🥰 pic.twitter.com/gFxjTq5CFD
— MrBeast (@MrBeast) December 8, 2024
తన యూట్యూబ్ చానల్ మీద ఏడాదికి రూ. నాలుగు వేల కోట్లను బీస్ట్ సంపాదిస్తాడని చెబుతారు. కేవలం వ్యూస్ ద్వారా మాత్రమే కాదు బ్రాండ్ ప్మోటింగ్ కూడా చేస్తాడు. ఇలా చేసినందుకు లక్షల డాలర్లు కుమ్మరిస్తారు. ఈ సారి తన యూట్యూబ్ చానల్ తో పాటు.. అమెజాన్ ప్రైమ్ కంపెనీతోనూ ఒప్పందం చేసుకున్నారు. తాను నిర్మించిన కాలనీలో నిర్వహించబోయే్ ఆటలను అక్కడ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇందు కోసం అమెజాన్ ప్రైమ్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున డాలర్లు ముట్టచెప్పినట్లుగా తెలుస్తోంది.
$5,000,000 Prize
— MrBeast (@MrBeast) December 16, 2024
50 World Records broken
1,000 Contestants duking it out
Biggest sets in entertainment history
Beast Games drops Thursday 🥰 pic.twitter.com/sNNvvmTDGO