News
News
X

Himachal Congress Manifesto: యువ ఓటర్లను టార్గెట్ చేసిన కాంగ్రెస్, హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Himachal Congress Manifesto: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది.

FOLLOW US: 
 
Himachal Congress Manifesto:

10 అంశాలతో మేనిఫెస్టో..

హిమాచల్‌ ప్రదేశ్‌లో (Himachal Pradesh Assembly Elections) ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. మరో వారం రోజులే మిగిలి ఉండటం వల్ల అన్ని పార్టీలు ప్రచారంలో జోష్ పెంచాయి. మేనిఫెస్టోలు విడుదల చేయడంలో బిజీ అయిపోయాయి. ఇటీవలే కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. లక్ష మందికి ఉద్యోగాలు, పాత పెన్షన్ స్కీమ్‌ని మళ్లీ అమలు చేయడం, హర్ ఘర్ లక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంట్లోని
మహిళకు నెలనెలా రూ.1500 నగదు బదిలీ లాంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  4 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చింది కాంగ్రెస్. మొత్తం 10 అంశాలు ఇందులో చేర్చింది. 

మేనిఫెస్టోలోని అంశాలివే..

News Reels

1. పాత పెన్షన్ స్కీమ్‌ను మళ్లీ అమలు చేయడం. 
2. 5 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన
3. మహిళలకు నెలనెలా రూ.1500 నగదు బదిలీ
4. 300 యూనిట్ల వరకూ అందరికీ ఉచిత విద్యుత్ 
5. పండ్ల ధరలు నిర్ణయించే హక్కు ఉద్యాన పంటలు పండించే వారికే ఇవ్వడం. 
6. యువత కోసం అంకుర సంస్థలు స్థాపించేందుకు రూ.680 కోట్ల నిధులు
7. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు
8. ప్రతి గ్రామంలో, మొబైల్ క్లినిక్‌లో ఉచిత వైద్యం 
9. పాడి రైతుల నుంచి రోజూ 10 లీటర్ల పాలు కొనుగోలు చేయడం  
10. రూ.2 కిలో చొప్పున పేడను కొనుగోలు చేయడం  

ఈ సారి గెలిచేదెవరు..? 

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. హిమాచల్‌లో భాజపా అధికారంలో ఉంది. ఈ సారి కూడా కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కాషాయ పార్టీ. 88 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు భాజపా అధికారంలోకి రాగా...జైరామ్ ఠాకూర్ సీఎం అయ్యారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ABP News,C Voter సర్వే ఒపీనియన్ పోల్ రిజల్ట్స్‌తో ముందుకొచ్చింది. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి..? ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశముంది..? అనే విషయాలు అంచనా వేసింది. ABP News-CVoter Opinion Poll 2022 ప్రకారం...2017తో పోల్చి చూస్తే..హిమాచల్‌లో భాజపా ఓటు షేర్ కాస్త తగ్గనుంది. ఈ ఏడాది ఓటు షేర్ 45.2%గా ఉండగా...2017లో ఇది 48.8%గా నమోదైంది. ఇక మిగతా పార్టీల సంగతి చూస్తే...కాంగ్రెస్‌ ఓటు శాతం 33.9%గా అంచనా వేసింది.

Also Read: Himachal Pradesh elections: ప్రజలు మోదీ వెంటే నడుస్తారు, కాంగ్రెస్‌కు కాలం చెల్లింది - ఏబీపీ స్పెషల్ ఇంటర్వ్యూలో హిమాచల్ సీఎం

Published at : 05 Nov 2022 12:14 PM (IST) Tags: Himachal Pradesh Elections 2022 HP Election 2022 Himachal Pradesh Elections Himachal Congress Manifesto Himachal Congress

సంబంధిత కథనాలు

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

Nadendla Manohar : పవన్ ప్రచార రథం రంగుపై వైసీపీ విమర్శలు, నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్

TS Inter Fees: ఇంట‌ర్ విద్యార్థులకు అలర్ట్, ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?

TS Inter Fees:  ఇంట‌ర్ విద్యార్థులకు అలర్ట్, ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

Minister KTR : తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు - మంత్రి కేటీఆర్

Minister KTR :  తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు - మంత్రి కేటీఆర్

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!