అన్వేషించండి

Five Decades Godavari Express: ఐదు దశబ్దాలపాటు ఆగని గోదావరి ఎక్స్ ప్రెస్ పరుగులు...సిల్వర్ జూబ్లీ వేడుకలతో మురిసిపోయిన రైలుబండి

Godavari Express: ఐదు దశాబ్దాల పాటు అలుపెరగకుండా పరుగులు పెడుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్, నేడు ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు

Godavari Express Silver Jubilee Celebrations : గోదావరిలో పడవ ప్రయాణం...గోదావరి ఎక్స్ ప్రెస్ లో రైలు ప్రయాణం ఒకే అనుభూతిని కలిగిస్తాయి. హైదరాబాద్ నుంచి (Hyderabad) విశాఖ(Visaka) వెళ్లాలంటే ఒకప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు, వీఐపీల దగ్గర నుంచి సామాన్య ప్రజలందరినీ ఒకటే ఒక ఆప్షన్ గోదావరి ఎక్స్ ప్రెస్(Godavari Express)...ఇప్పటికీ విశాఖ వెళ్లే వారు మొదటి బెర్తు వెతికేది గోదావరి ఎక్స్ ప్రెస్ లోనే ….ఆ బండిలో సీట్లన్నీ అయిపోయాంటేనే....ఆ తర్వాత ఆప్షన్ కు వెళ్తారంటే అర్థం చేసుకోవచ్చు....ఈ రైలుబండితో ఆ ప్రాంత ప్రజలకు బంధం ఎంత గట్టిగా పెనవేసుకుందో....అయినా అంబాసిడర్ కారు, బజాజ్ చేతక్, గోదావరి ఎక్స్ ప్రెస్ ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఇప్పుడంటే విమాన సర్వీసు పెరిగిపోయాయి కానీ...అప్పట్లో ఉత్తరాంధ్ర నుంచి ఏ మంత్రి హైదరాబాద్ రావాలన్నా...ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నా గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సిందే

టైం అంటే టైమే....

దశబ్దాల తరబడి ఇంతమందిని ఆకట్టుకోవడానికి ఆ బండిలో ఏముంది చెప్పుమా అంటే ఠంచనుగా అందరూ చెప్పే ఏకైక మాట....గోదావరి అంటే టైం...టైం అంటే గోదావరి ఎక్స్ ప్రెస్ అంటారు. ఇప్పుడంటే అన్నీ కంప్యూటరైజ్డ్ సిగ్నిలింగ్ వ్యవస్థ, కరెంట్ తో స్పీడ్ గా పరుగులు తీసే వందేభారత్(Vandhe Bharath) రైళ్లు వచ్చాయి కానీ...ఇలాంటి ఆధునిక వ్యవస్థలు లేని కాలంలోనూ గోదావరి కరెక్ట్ టైంకు ప్లాట్ ఫారం మీదకు వస్తుందనేవారు. ఇక హాయిగా హైదరాబాద్ ఎక్కేసి...ఏ ఖమ్మం దాటే వరకు బాతాఖానీ కోట్టుకుంటూ కునుకేసేమనుకోండి.....పొద్దున్నే విశాఖ బీచ్ లో సూర్యభగవానుడి లేలేత కిరణాలను చూడొచ్చు. అందుకే ఈ బండికి అంత డిమాండ్. పైగా ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అన్ని రైళ్లు దాదాపు ఒడిశా, హౌరా వరకు వెళ్తుంటాయి. ఇక ఆ ఒడిశా కార్మికుల బీడీ పొగలు, గుట్కా వాసనలతో కడుపులో పేగులు కదిలిపోతాయి. కిటికీల పక్కన కూర్చుని వాళ్లు చేసే రచ్చ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదే మన గోదావరి ఎక్స్ ప్రెస్ అనుకోండి...మన గోదారోళ్లతోపాటు విశాఖ వరకు వెళ్లే వారే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు మన గోదావరి ఎక్స్ ప్రెస్ కే..

ఐదు దశాబ్దాల అనుబంధం...

కేంద్ర బడ్జెట్ లో మన రైల్వే ప్రాజెక్ట్ లకు ఏమంత విదిల్చిన దాఖలాలు కూడా మరి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా....మన గోదావరి ఎక్స్ ప్రెస్ తొలిసారి పట్టాలపై ఎక్కి నేటికి సరిగ్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1974 ఫిబ్రవరి 1వ తేదీన మొదటి సారిగా వాల్తేరు నుంచి సికింద్రాబాద్ మధ్య పరుగులు తీసింది. మొత్తం 18 స్టేషన్లలో ఆగి ప్రయాణికులని ఎక్కించుకుని వెళ్లే ఈ రైలు 710 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు...మొత్తం 17 బోగీలతో దూసుకుపోయే ఈ రైలు సరాసరి వేగం గంటకు 57 కిలోమీటర్లు . గోదావరి విశాఖలో బయలుదేరిన సందర్భంగా అక్కడి అధికారులు రైలును పూలతో అలంకరించారు. కేక్ కట్ చేసి ముందస్తు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు.

టాప్ హెడ్ లైన్స్

Yuvraj Singh Love Story: ఆసీస్ టూర్ మధ్యలో నా వెంట క్యాన్‌బెర్రాకు వచ్చేసింది.. నా షూస్ సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి పింక్ స్లిప్పర్స్ వేసుకోమంది, స్టార్ హీరోయిన్‌తో లవ్ స్టోరీపై యువరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆసీస్ టూర్ మధ్యలో నా వెంట క్యాన్‌బెర్రాకు వచ్చేసింది.. నా షూస్ సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి పింక్ స్లిప్పర్స్ వేసుకోమంది, స్టార్ హీరోయిన్‌తో లవ్ స్టోరీపై యువరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmial Daughter Wedding: వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.. నేడు క్రిస్టియన్, రేపు హిందూ సంప్రదాయంలో పెళ్లి!
వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.. నేడు క్రిస్టియన్, రేపు హిందూ సంప్రదాయంలో పెళ్లి!
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Flipkart CEO Resigns: ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. అసలు కారణాలివేనా?
ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. అసలు కారణాలివేనా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget