By: ABP Desam | Updated at : 03 Aug 2023 07:26 PM (IST)
ఆధార్ అప్‌డేట్ కోసం కంగారు పడుతున్నారా ? - ఇదిగో గుడ్ న్యూస్
Aadhar Update Time : ఆధార్ కార్డ్ తీసుకుని పదేళ్లు అయిన వారందరూ ఖచ్చితంగా అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం ఇటీవల సూచించింది. దీంతో చాలా మంది ఆధార్ సెంటర్లకు పరుగులు తీశారు. అందరికీ ఉచితంగానే ఆధార్ అప్ డేట్ చేశారు . కానీ ఉచిత సేవల సమయం పూర్తయింది. జూన్ 14 వరకూ ఉచిత సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి చార్జ్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఉచిత సర్వీస్ గడువునూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్తుతం సెప్టెంబర్ 30 వరకూ ఉడాయ్ గడవు పెంచింది. ఈ ఉచిత సేవ ప్రత్యేకంగా మైఆధార్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం రూ. 50 ఛార్జీ కట్టాల్సి ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, చిరునామా మొదలైనవి ప్‌డేట్ చేయాలనుకుంటే ఆన్‌లైన్ అప్‌డేట్ సేవను ఉపయోగించుకోవచ్చు. అది పూర్తిగా ఉచితం. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు. కానీ ఆధార్ కేంద్రానికి వెళ్తే మాత్రం రూ. యాబై కట్టాల్సి ఉంటుంది.
ఉచితంగా ఆధార్ కార్డ్ అప్ డేట్ ఎలా చేసుకోవాలంటే ?
ఆధార్ కార్డులను అప్డేట్ చేయడానికి మీరు పోర్టల్ లో కొత్త డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా my Aadhaar పోర్టల్ కు లాగిన్ అవ్వాలి. పోర్టల్ లో లాగిన్ అవ్వటానికి ముందుగా మనం ఆధార్ కార్డు నంబర్ ను, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆపై క్రిందికి స్క్రోల్ చేసి డాక్యుమెంట్ అప్డేట్ పై క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ అప్డేట్ యాప్ లోకి వెళ్ళిన తర్వాత మనం సరి చెయ్యాలి అనుకున్న వివరాలను సరిచేసి ఆపై హైపర్ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్కాన్ చేసి పెట్టుకున్న ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లను అప్లోడ్ చేయాలి. అప్డేట్ చేయవలసిన అంశాలను అప్డేట్ చేసిన తర్వాత మీకు 14 అంకెల అప్డేషన్ అభ్యర్థన నెంబర్ వస్తుంది. ఇది అప్డేట్ ప్రక్రియ యొక్క దశను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మొత్తం అప్ డేట్ అయిన తర్వాత అప్డేట్ అయిన ఆధార్ కార్డు అందులో జనరేట్ అవుతుంది. ఫ్రీ గా త్వరితగతిన చేసుకునేలా ఈ ఆధార్ అప్డేషన్ ప్రక్రియకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సమయాన్ని ఇచ్చింది. నేటితో ఇది ముగియనున్న నేపథ్యంలో ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనుకునేవాళ్ళకు ఇది మంచి చాన్స్. వచ్చే నెల 30వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.
ఆధార్ సెంటర్ కు వెళ్తే రూ. యాభై చార్జీలు కట్టాల్సి రావడంతో చాలా సమయం ఎదురు చూడాల్సి ఉంటుంది. అందుకే సింపుల్ గా అయిపోయే ఆన్ లైన్ విధానానికే ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తున్నారు.
FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా?, సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్ బ్యాంకుల ఇవే!
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
Ganesh Immersion 2023: ఘనంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు - గంగమ్మ ఒడికి చేరిన లక్షల విగ్రహాలు
Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Rs 2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
/body>