News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Monkeypox case in India: భారత్‌లోనూ మంకీపాక్స్ కలవరం! యూరప్‌ వెళ్లొచ్చిన యువకుడిలో లక్షణాలు?

భారత్‌లోనూ మంకీపాక్స్‌ కలవరం మొదలైంది. కోల్‌కతాలోని ఓ యువకుడిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి.

FOLLOW US: 

సాంపిల్ టెస్ట్‌ రిజల్ట్ ఎలా వస్తుందో..? 

భారత్‌లో తొలిసారి మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తిని వైద్యులు గుర్తించారు. కోల్‌కతాలోని ఓ విద్యార్థిలో ఈ సింప్టమ్స్ ఉన్నట్టు వెల్లడించారు. ఇటీవలే యూరప్‌కు వెళ్లొచ్చిన యువకుడికి శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా. మంకీపాక్స్‌కు సంబంధించిన ఇతర లక్షణాలూ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి పశ్చిమ బంగ రాష్ట్ర ఆరోగ్యశాఖ, ఆ విద్యార్థిని ఐసోలేషన్‌లో ఉంచింది. శాంపిల్ సేకరించి, మంకీపాక్స్‌ అవునో కాదో అని నిర్ధరించేందుకు పుణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కి పంపింది. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. యూరప్‌లో మంకీపాక్స్‌ కేసులు భారీగా నమోదవుతుండటం, అక్కడి నుంచే ఈ యువకుడు రావటం అధికారులను కలవర పెడుతోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, ఈ వైరస్ ఇతరులకూ సోకుతుందని భావించి, వెంటనే ఐసోలేషన్‌కు పంపారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పని లేదని, వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ నుంచి రిపోర్ట్ వచ్చిన తరవాతే వైరస్ ఉందా లేదా అన్నది నిర్ధరణ అవుతుందని అధికారులు చెబుతున్నారు. కోల్‌కతాలోనే ఓ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న యువకుడిని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హెల్త్ కండీషన్‌ని గమనిస్తున్నారు. 

మంకీపాక్స్ లక్షణాలివే..

యువకుడి కుటుంబ సభ్యుల్లో మాత్రం ఎవరికీ ఇలాంటి లక్షణాలు కనిపించలేదని అధికారులు స్పష్టం చేశారు. అయినా జాగ్రత్తగా ఉండాలని, ఏ కాస్త ఇబ్బందిగా అనిపించినా వెంటనే ఆసుపత్రికి రావాలని వారికి సూచించారు. నిజానికి...ఈ మంకీపాక్స్ వైరస్ చాలా అరుదైనది. అంత సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. తుమ్ము, దగ్గులు, గాలి ద్వారా ఇది వ్యాపించదన్నది నిపుణులు చెబుతున్న మరో విషయం. ఈ వైరస్ సోకిన వ్యక్తితో శారీరకంగా చాలా దగ్గరగా ఉంటేనే ఇదే సోకే ప్రమాదముంటుంది. ఆ సమయంలో ఈ వైరస్ నోరు, ముక్కు, కళ్లు, శ్వాసనాళం ద్వారా లోపలికి ప్రవేశించవచ్చు. అలాగే గాయాలైనప్పుడు చర్మం ఓపెన్ అయి ఉంటుంది. వైరస్ ఆ గాయం ద్వారా శరీరంలో చేరే అవకాశం ఉంది. మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమదేశాల్లో, మధ్య దేశాల్లో కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. 
ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరిగిపోతాయి. తలనొప్పి, జ్వరం, వెన్ను నొప్పి, కండరాల నొప్పి, చలి, అలసట లాంటివి ప్రారంభదశలో కనిపించే లక్షణాలు. చికెన్ పాక్స్ ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. 

Also Read: Hyper Aadi - Kiraak RP: 'కెజియఫ్'లో బానిసల్లా, కుక్కల్లా చూస్తే ఎవరుంటారు? 'హైపర్' ఆది కూడా మానేస్తున్నాడు - 'కిరాక్' ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్

Published at : 09 Jul 2022 01:33 PM (IST) Tags: Kolkata Monkeypox Monkeypox Virus Monekypox in India

సంబంధిత కథనాలు

Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి

Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

CJI : సీజేఐ చేతుల మీదుగా ఈ నెల 20న కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం

CJI : సీజేఐ చేతుల మీదుగా ఈ నెల 20న కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం

Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎం వార్నింగ్

Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎం వార్నింగ్

AP EAMCET Counselling Dates 2022 : ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

AP EAMCET Counselling Dates 2022 : ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు