Hyper Aadi - Kiraak RP: 'కెజియఫ్'లో బానిసల్లా, కుక్కల్లా చూస్తే ఎవరుంటారు? 'హైపర్' ఆది కూడా మానేస్తున్నాడు - 'కిరాక్' ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్
నటీనటులను 'కెజియఫ్'లో బానిసల్లా చూశారని, భోజనం కూడా సరిగా పెట్టలేదని మల్లెమాల సంస్థపై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో 'హైపర్' ఆది కూడా మానేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' కార్యక్రమాల్లో కొత్త టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు కనిపిస్తున్నారు. సీనియర్లు ఒక్కొక్కరుగా షో వదిలి వెళ్తున్నారు. ధనరాజ్, వేణు తదితరులు ఎప్పుడో షో నుంచి వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో 'సుడిగాలి' సుధీర్, యాంకర్ అనసూయ, కొన్ని రోజుల క్రితం జడ్జ్ నాగబాబు సహా 'కిరాక్' ఆర్పీ, 'చమ్మక్' చంద్ర, 'అధిరే' అభి తదితరులు వెళ్లిపోయారు. మల్లెమాల సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న షోలకు గుడ్ బై చెప్పేశారు. త్వరలో 'హైపర్' ఆది కూడా గుడ్ బై చెబుతారని 'కిరాక్' ఆర్పీ అంటున్నారు.
'అధిరే' అభి టీమ్ మెంబర్‌గా 'జబర్దస్త్'లో 'హైపర్' ఆది ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత టీమ్ లీడర్ అయ్యారు. 'ఢీ' షో చేయడం స్టార్ట్ చేశారు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కూడా చేస్తున్నారు. అయితే... కొన్ని రోజుల నుంచి 'జబర్దస్త్' చేయడం మానేశారు ఆది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 'కిరాక్' ఆర్పీ చెప్పిన మాటల ప్రకారం... 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమాలకు కూడా 'హైపర్' ఆది గుడ్ బై చెప్పనున్నారు.
Also Read : 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' రివ్యూ: మోడ్రన్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ ఎలా ఉంది?
మల్లెమాల సంస్థ తమను కుక్కలా, 'కెజియఫ్'లో బానిసల్లా చూశారని, సరైన భోజనం పెట్టలేదని, ఉదయం వండిన అన్నం సాయంత్రం పులిహోర చేసి పెట్టేవారని... భోజనం సరిగా లేకపోవడం కూడా 'జబర్దస్త్' షో మానేయడానికి ఒక కారణమని ఒక ఇంటర్వ్యూలో 'కిరాక్' ఆర్పీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగబాబుతో చర్చించిన తర్వాత తాము కలిసి నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. 'జబర్దస్త్' చేసేటప్పుడు మూడేళ్లు తన సొంత డబ్బులతో వంట చేయించి తన టీమ్ మెంబర్లకు ఫుడ్ పెట్టానని 'కిరాక్' ఆర్పీ చెప్పుకొచ్చారు.
Also Read : హిందీలో సమంతకు మరో అవకాశం - స్టార్ హీరో కుమార్తెను తప్పించి మరీ...
View this post on Instagram