By: ABP Desam | Updated at : 20 Oct 2021 03:47 PM (IST)
హిడ్మా కోసం అడవుల్ని జల్లెడ పడుతున్న బలగాలు
గోదావరి తీరంలోని మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో హెలికాఫ్టర్ నిఘా కలకలం రేపుతోంది. ఓ వైపు మావోయిస్టుల కీలక నాయకుడు హిడ్మా వైద్యం కోసం సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చారన్న ప్రచారంతో ఆయన కోసమే హెలికాఫ్టర్ నిఘాను ఏర్పాటు చేశారని భావిస్తున్నారు. హిడ్మా ఏటూరునాగారం సమీప అడవుల్లోకి వచ్చారని పోలీసు వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. దీంతో అక్కడ నిఘాను పెంచారు.
Also Read : "హిడ్మా" టార్గెట్‌గా భారీ ఆపరేషన్ .. వైద్యం కూడా అందకుండా కట్టడి !
పీఎల్‌జీఏ కమాండర్అయిన హిడ్మా తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి వచ్చినట్లుగా ఖచ్చితమైన సమాచారం పోలీసులకు వచ్చింది. గోదావరి పరివాహకం ఉన్న 8 మండలాల పరిధిలో.. తుపాకులగూడెం అడవుల్లో దట్టమైన గుట్టలు, వాగులు ఉన్న ప్రాంతాల్లో హిడ్మా మకాం వేసినట్లుగా భావిస్తున్నారు. అందుకే పోలీసు కమెండోలు అడవులకు చేరుకుని దిగ్బంధం చేశారు. ఫలితంగా ఏటూరునాగారం మొత్తం అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
Also Read : ఆర్కే స్థానంలో సుధాకర్ ? ఏవోబీలో పట్టు జారకుండా మావోయిస్టుల పక్కా వ్యహం !
ఆపరేషన్ హిడ్మాను ప్రత్యేకంగా ఓ ఉన్నతాధికారి పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. హిడ్మా అడవుల్లో ఎక్కడ మకాం వేశాడనే అంశంపై కూపీలాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంటలిజెన్స్‌కు చెందిన ప్రత్యేక ఉన్నతాధికారి కూడా గట్టుచప్పుడు కాకుండా సాధారణ దుస్తుల్లో ఏజెన్సీలో తిరుగుతూ సమాచారం సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో మకాం వేసినట్లుగా తెలుస్తోంది. కంటికి కనిపించని డ్రోన్ కెమెరాలతో నిఘానేత్రంతో అడవులు అడవులు జల్లెడపడుతున్నారు.
హిడ్మా అనారోగ్యంోత బాధపడుతున్నారు. వైద్యం కోసం వచ్చారు. ఆయన హోదా ప్రకారం కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు భద్రత కల్పిస్తారు. నాలుగంచెల భద్రత ఉంటుంది. ఈ భద్రత నడుమే సురక్షిత ప్రాంతానికి హిడ్మా ఎప్పటికప్పుడు తరలి వెళ్తున్నట్లుగా భావిస్తున్నారు. గోదావరి తీరంలోని అడవుల్లో ఉండే గిరిజనలు ఎంతటి రహస్యాన్ని అయినా బయట పెట్టరు. గుత్తికోయకు చెందిన హిడ్మా అంటే వారికి అభిమానం ఉంటుంది. హిడ్మా గురించి సమాచారం అసలు చెప్పరు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న గుత్తి కోయ గూడేల చుట్టూ సీసీ కెమెరాలను పోలీసులు అమర్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Warangal News: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 147 మంది బాలకార్మికులకు విముక్తి- సీపీ ఏవీ రంగనాథ్
Medaram Mini Jathara 2023: ఘనంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర!
Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్సీసీ కేడెట్స్- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
Unstoppable NBK PSPK: దేశంలోనే తొలిసారి - కొత్త రికార్డులు సృష్టిస్తున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్!
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!
AP Govt Employees Union : జీతాల చెల్లింపుల చట్టబద్దతపై మరోసారి గవర్నర్ ను కలుస్తాం- సూర్యనారాయణ
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!