అన్వేషించండి

Operation Hidma : "హిడ్మా" టార్గెట్‌గా భారీ ఆపరేషన్ .. వైద్యం కూడా అందకుండా కట్టడి !

మరో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఆరోగ్య సమస్యల్లో ఉన్నారు. ఆయన వైద్యం కోసం తెలంగాణ అటవీ ప్రాంతానికి వచ్చినట్లుగా స్పష్టమైన సమాచారం ఉండటంతో పోలీసులు ఆస్పత్రులు, వైద్యులపై నిఘా పెట్టారు.

తెలంగాణ - చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో బలగాలు "ఆపరేషన్ హిడ్మా"ను జోరుగా కొనసాగిస్తున్నాయి. బలగాలకు మావోయిస్టు మోస్ట్ వాటెండ్‌గా మాడ్వీ హి‌డ్మా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌గా ఉన్నారు.  అనారోగ్యంతో చికిత్స పొందేందుకు తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి హిడ్మా వచ్చారని స్పష్టమైన సమాచారం ఉండటంతో  అడవులను జల్లెడ పడుతున్నారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. 

Also Read : ఆర్కే స్థానంలో సుధాకర్ ? ఏవోబీలో పట్టు జారకుండా మావోయిస్టుల పక్కా వ్యహం !

హిడ్మాపై స్లో పాయిజన్ ద్వారా విష ప్రయోగం జరిగిందని వైద్యం కోసం తెలంగాణకు వచ్చాడని కొన్నివర్గాలు...  ఆర్కే మృతికి కారణాలను ఆరా తీసేందుకు వచ్చాడని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. పలిమెల, మహాదేవపూర్‌, మహాముత్తారంతోపాటు.. ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట అడవుల్లో హిడ్మా తలదాచుకునే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఎల్‌జీఏ నేత కావడంతో హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉం టుంది. అంటే కనీసం పాతిక మంది సాయుధులైన మావోయిస్టులు అతనికి కాపలాగా ఉంటారు.

Also Read : అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..

మరోవైపు హిడ్మా తన బృందంతో భూపాలపల్లి, ములుగు జిల్లా సమీపంలో గోదావరితీరం దాటి ఉండొచ్చనే అనుమానాలు పోలీసు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మహదేవపూర్‌-ఏటూరునాగారం ఏరియా కమిటీ హిడ్మాకు ఆశ్రయం ఇచ్చి ఉంటుందని  భావిస్తున్నారు. వైద్యం కోసం వచ్చి ఉంటే ఆస్పత్రుల్లో పట్టుకోవచ్చని భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని అడవి ప్రాంత ఆర్‌ఎంపీలు, పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచారు.  

Also Read : మన సరిహద్దులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా... అనారోగ్యమా? అగ్ర నేత మృతిపై ఆరా తీసేందుకా...?

మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా దళంలోని కొందరు వ్యక్తులు స్లోపాయిజన్‌ ప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కూడా కొవిడ్‌ నుంచి కోలుకున్నా తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డారు. స్లో పాయిజన్ ద్వారా విషప్రయోగం  చేయడం వల్ల మెల్లగా శరీర భాగాలపై ప్రభావం చూపించిందని  అనుమానిస్తున్నారు. ఉన్నట్లుంగా నరాల బలహీనత సమస్య ఆర్కేను తీవ్రంగా వేధించిందని సమాచారం. హిడ్మాలో కూడా క్రమంగా ఇలాంటి లక్షణాలే బయట పడుతున్నాయని.. దాతో విష ప్రయోగం జరిగిందన్న అనుమానంతో వైద్యం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.  తెలంగాణ- చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాల్లో టెన్షన్ వాతారణం కనిపిస్తోంది. 

Also Read : మావోయిస్టు నేత ఆర్కే మరణం ప్రభుత్వ హత్యే... మావోయిస్టుల ఆహారంలో విషం కలుపుతున్నారు... ఆర్కే భార్య శిరీష ఆరోపణ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Safest Budget Cars: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!
రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Safest Budget Cars: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!
రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget