Akkiraju Haragopal: అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..
అక్కిరాజు హరగోపాల్ అనే వ్యక్తి ఆర్కేగా మారి మావోయిస్టు పార్టీలో ఎలా కీలకంగా వ్యవహరించారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వెలుగొందిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడి ఆయన చనిపోవడంతో మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు. అయితే, అక్కిరాజు హరగోపాల్ అనే వ్యక్తి ఆర్కేగా మారి మావోయిస్టు పార్టీలో ఎలా కీలకంగా వ్యవహరించారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ, అసలు ఆయన ఆర్కే ఎలా అయ్యారనే విషయం వెనుక ఆసక్తికర అంశం ఉంది.
ప్రత్యేకంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినంత వరకూ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంటే ఎవరిదో ఒకరి పేరు కాదు. ఎవరూ గుర్తించకూడదని ఎవరుపడితే వారు పెట్టుకునే మారుపేరు కూడా కాదు. మావోయిస్టు పార్టీలో అతికొద్ది మందికి ఈ ఆర్కే అనే పేరు వస్తుంది.
Also Read: Nalgonda: కొడుకుని కొంగుకు కట్టేసుకొని కాల్వలో దూకేసిన తల్లి.. కారణం ఏంటంటే..
రాష్ట్ర కార్యదర్శి ఎవరైనా.. అతని పేరు ఆర్కేనే..!
రామకృష్ణ అలియాస్ ఆర్కే.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా మావోయిస్టులకు సంబంధించి ఎక్కడైనా ఉదంతం జరిగితే ఈ ఆర్కే అనే పేరు కచ్చితంగా వినబడేది. అందుకు ఓ కారణం ఉంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర సెక్రెటరీగా ఉన్న ఎవరైనా అతని అసలు పేరుతో పాటు అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అని పెట్టుకునేవారు. అందుకే గతంలో పీపుల్స్ వార్ పార్టీ నుంచి ఈ పేరుతో ఏదైనా ప్రకటనో, సమాచారమో వస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అప్రమత్తం అయ్యేవారు. రామకృష్ణ అలియాస్ ఆర్కే అనే పేరుకి మావోయిస్టు పార్టీలో అంతటి ప్రాధాన్యం ఉంది.
Also Read: వైద్యం చేస్తానంటూ మహిళను ఇంట్లోకి పిలిచి అత్యాచారయత్నం.. తర్వాత గొడ్డలితో నరికి.. ఆపై..
ఆర్కే పేరునే పెట్టుకోవడం ఎందుకంటే..?
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరంగల్‌లో ఓ పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ సమయంలో మావోయిస్టు పార్టీలోనే పుట్టి పెరిగిన 11 ఏళ్ల రామకృష్ణ రెడ్డి అనే బాలుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఆ చిన్న బాలుడి వీరమరణానికి గుర్తుగా ఆంధ్ర ప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీకి రాష్ట్ర సెక్రెటరీగా ఎవరు వచ్చినా సరే.. రామకృష్ణ అలియాస్ ఆర్కే అని పిలిచేవారు. అలా గతంలో రాష్ట్ర సెక్రటరీగా పనిచేసిన చాలా మంది ఆర్కే గానే పిలిపించుకునేవారు. రాను రాను ఆ పేరు పార్టీలో ఓ బ్రాండ్‌గా మారింది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో చర్చల విషయంలో రాష్ట్ర కార్యదర్శిగా అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఉండేవారు. అయితే, ఆయన అసలు పేరు బయటకు రావడంతో ఆ తర్వాత వచ్చిన వారికి ఆర్కే అనే పేరును కేటాయించేందుకు మావోయిస్టు పార్టీ సుముఖత వ్యక్తం చేయలేదు.
అక్కిరాజు హరగోపాల్ అనంతరం రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ బాధ్యతలు చేపట్టినా అతనికి అలియాస్ ఆర్కే అనే పేరు ఇవ్వలేదు. కానీ ఇప్పటికీ ఆర్కే అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి మావోయిస్టుల్లో ఒక బ్రాండ్‌గా మిగిలిపోయింది. అక్కిరాజు హరగోపాల్ చివరి ఆర్కే కావడంతో అయనకు అది అలియాస్‌గా స్థిరపడిపోయింది.
Also Read: Kurnool Crime: భర్త గొంతుకు టవల్ చుట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి..