(Source: ECI/ABP News/ABP Majha)
Nalgonda: కొడుకుని కొంగుకు కట్టేసుకొని కాల్వలో దూకేసిన తల్లి.. కారణం ఏంటంటే..
భర్త పెద్ద చదువులు చదువుతుండడంతో సౌలభ్యం కోసం ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. నగరంలోని తార్నాకలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిడమనూరు మండలంలోని బంకాపురం అనే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చిన్న వెంకట లింగయ్యకు అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన హేమలత అనే 30 ఏళ్ల మహిళతో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద కొడుకుకు నాలుగేళ్లు కాగా.. అతను పుట్టుకతోనే మూగ వ్యక్తి. భర్త పెద్ద చదువులు చదువుతుండడంతో సౌలభ్యం కోసం ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. నగరంలోని తార్నాకలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం దసరా పండుగ సందర్భంగా హేమలత తన పుట్టింటికి వెళ్లింది. తనతోపాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకొని వెళ్లింది. సోమవారం హైదరాబాద్ వెళ్దామని భర్తకు కూడా ఫోన్ చేసి చెప్పింది. ఈలోపు షాపింగ్ చేసుకొని వస్తానని పెద్ద కొడుకును బయటికి తీసుకొని వెళ్లింది.
ఆమె నుంచి హాలియాకు వెళ్లినట్లు సమాచారం. అప్పటికే తన కుమారుడి పరిస్థితితో మనస్తాపం చెంది కుమిలిపోతుండడంతో అఘాయిత్యానికి పాల్పడింది. హాలియాలోని ఎడమ కాలువ గేట్ల దగ్గర కొడుకుని చీర కొంగుతో నడుముకు కట్టుకుని పారుతున్న కాల్వలోకి దూకేసింది. ఆ రోజు ఆదివారం సమీపంలోనే సంత ఉండడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారు గమనించి వారిని బయటికి తీశారు. తాడు సహాయంతో వారు ఇద్దరిని ఒడ్డుకు చేర్చగా.. వెంటనే అంబులెన్స్‌ను రప్పించి సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి చేర్చారు.
Also Read: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీ కుమారుడిని ప్రశ్నించేందుకు వచ్చారు. అప్పటికే బాలుడు మృత్యువాతపడగా.. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత కాలంగా కుమారుడి పరిస్థితి చూసి ఆమె కుంగిపోయి ఉందని భర్త వెల్లడించాడు. భార్య హేమలత కూడా పీజీ పూర్తిచేసిందని, ఆమె చిన్న తనం నుంచి సున్నిత స్వభావంతో ఉండేదని బంధువులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కొడుకుపై మనోవేదనతో అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని వివరించారు. హాలియా ఎస్సై శివ కుమార్ కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Also Read: Kurnool Crime: భర్త గొంతుకు టవల్ చుట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత ప్రియుడితో కలిసి..
Also Read: Bank Charges: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి