Abhinandan Varthaman Update: భారత్‌పై పాక్ అక్కసు.. విమానం ఏం కూలలేదట..! అభినందన్ ఏం చేయలేదట!
కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర పురస్కారం దక్కిన తర్వాత భారత్‌పై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది.
పాకిస్థాన్ మళ్లీ పాత పాటే పాడింది. దేని గురించి అనుకుంటున్నారా? ఇటీవల కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు 'వీర్ చక్ర' పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించడంపై పాకిస్థాన్ విషం కక్కింది. 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానం ఎఫ్-16ను తాము కూల్చివేశామని భారత్ చేస్తోన్న వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. ఇది నిరాధారమని ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
పాకిస్థాన్‌తో జరిగిన వాయు ఘర్షణలో అభినందన్ చూపిన శౌర్యానికి 'వీర్ చక్ర' పురస్కారంతో కేంద్రం సత్కరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన సోమవారం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత.. 2019, ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో అభినందన్ ధైర్యసాహసాలు చూపించారు. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడి దాయాదుల ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చారు.
Also Read: Punjab Elections 2022: 'కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కానీ ఆ చెత్త మాకొద్దు'
Also Read: Covid 19 3rd Wave: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే?
Also Read: Central Vista Project: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై మరో పిటిషన్ తిరస్కరణ.. ఇక లైన్ క్లియర్!
Also Read: Corona Cases: దేశంలో 543 రోజుల కనిష్ఠానికి రోజువారి కరోనా కేసులు
Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు