UAE lottery Winner: 240 కోట్లు లాటరీ కొట్టాడు సరే మరి టాక్సులు కట్టాల్సిందేనా ? సగం పోతాయా ?
Lottery Tax: యూఏఈలో ఓ తెలుగోడు 240 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. అందరూ అభినందిస్తున్నారు. అయితే చాలా మంది సగం ట్యాక్సుల రూపంలో కట్టాలంటున్నారు. అందులో నిజం ఎంత ?

240 crore UAE lottery: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లాటరీలో భారతీయ యువకుడు అనిల్‌కుమార్ బొల్లా ₹240 కోట్ల గెలుపు సాధించిన సంఘటన సోషల్ మీడియాలో తరచూ చర్చనీయాంశమైంది. 29 ఏళ్ల అనిల్‌కుమార్ తన తల్లి పుట్టినరోజు ఎంపిక చేసుకుని 'లక్కీ డే డ్రా'లో మొదటి Dh100 మిలియన్ (సుమారు ₹240 కోట్లు) జాక్‌పాట్ గెలిచాడు. UAEలో పన్నులు లేకపోవడంతో పూర్తి మొత్తం అతని ఖాతాలో జమ అవుతుంది. కానీ, భారతదేశంలో ఈ పన్ను చెల్లించాలా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఇది అతని 'ట్యాక్స్ రెసిడెన్సీ' స్టేటస్‌పై ఆధారపడి ఉంటుందని పన్ను నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెసిడెంట్ ఇండియన్ (RI) అయితే 30% పన్ను, NRI అయితే పన్ను ఉండదని అంటున్నారు.
UAE లాటరీ అధికారికంగా 2024లో ప్రారంభమైంది. అనిల్‌కుమార్ బొల్లా, 23వ 'లక్కీ డే డ్రా'లో మొదటి జాక్‌పాట్ విజేతగా నిలిచాడు. అతను 'ఈజీ పిక్' ఆప్షన్ ఉపయోగించి నంబర్లు ఎంపిక చేసుకున్నాడు, చివరి డిజిట్ తన తల్లి పుట్టినరోజును ప్రతిబింబిస్తుందని చెప్పాడు. "నేను ఏమీ మ్యాజిక్ చేయలేదు, ఈజీ పిక్ ఎంపిక చేశాను. చివరి నంబర్ చాలా స్పెషల్ – అది నా అమ్మ పుట్టినరోజు" అని లాటరీ అధికారులతో ఇంటర్వ్యూలో అనిల్‌కుమార్ తెలిపాడు. UAEలో ఈ లాటరీ డిజిటల్ ఫార్మాట్‌లో జరుగుతుంది, చిన్న బహుమతులు రన్నర్సప్‌లకు కూడా ఇస్తారు.
UAEలో పన్ను లేదు
UAE ప్రభుత్వం ఆమోదించిన ఈ లాటరీలో గెలుపు మొత్తంపై ఎటువంటి పన్ను లేదు. "Dh100 మిలియన్ పూర్తిగా విజేతకు జమ అవుతుంది" అని UAE లాటరీ అధికారులు ప్రకటించారు. ఇది UAE ఆదాయపు పన్ను విధానాలకు అనుగుణంగా ఉంది, ఎందుకంటే అక్కడ పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ లేదు. భారతదేశంలో లాటరీ గెలుపులు 'ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్' కింద పన్ను విధిస్తారు. 30% ఫ్లాట్ రేట్ + 4% సెస్ (సుమారు 31.2%) చెల్లించాలి, ఎటువంటి డిడక్షన్లు లేవు. కానీ, విదేశీ గెలుపు మొత్తంపై పన్ను విధించడం రెసిడెన్సీ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది:
రెసిడెంట్ ఇండియన్ (RI) అంటే ఓ ఫిస్కల్ ఇయర్‌లో భారత్‌లో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే RIగా పరిగణిస్తారు. వారి గ్లోబల్ ఆదాయం విదేశీ లాటరీ సహా భారత్‌లో పన్ను పరిధిలోకి వస్తుంది. అనిల్‌కుమార్ RI అయితే, ₹240 కోట్లపై సుమారు ₹75 కోట్లు పన్నుగా చెల్లించాలి. DTAA (డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్) ప్రకారం UAEలో చెల్లించిన పన్ను క్రెడిట్ తీసుకోవచ్చు, కానీ అక్కడ పన్ను లేనందున పూర్తి మొత్తం పన్ను చెల్లించాలి,
నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అయితే 182 రోజుల కంటే తక్కువ ఉంటే NRIగా పరిగణిస్తారు. వారికి భారత్ సోర్స్ ఆదాయం మాత్రమే పన్ను. విదేశీ లాటరీ గెలుపు NRIకి పన్ను విధించరు. అనిల్‌కుమార్ UAEలో నివసిస్తున్నందున, అతను NRI అయ్యుండవచ్చు – దీనివల్ల పన్ను రహితంగా ఉండే అవకాశం ఉంది. అయితే, డబ్బును భారత్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తే లేదా ఇన్వెస్ట్ చేస్తే TDS ర్తిస్తుంది.





















