అన్వేషించండి

Collector Nagarani: కలెక్టర్ అమ్మ - తుఫాన్ బాధితులతో సహపంక్తి భోజనం - కుశల ప్రశ్నలు

West Godavari District Collector: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తుపాను బాధితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

West Godavari Collector Nagarani: సమస్యల్లో ప్రజలతో పాటు కలిసి .. వారి కోసం పని చేస్తే .. ఎంతో భరోసాగా ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తుపాను బాధితులతో అలాగే వ్యహవరిస్తున్నారు. ఓ శిబిరానికి వెళ్లిన కలెక్టర్.. వారికి వడ్డిస్తున్న భోజనాన్నే తిన్నారు.  పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇబ్బందులు  ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు.  నరసాపురం మండలం పెద్దమైన వానిలంక డిజిటల్ భవన్, వేముల దీవి మత్స్యకార బాలుర బీసీ వెల్ఫేస్ స్కూల్, మొగల్తూరు కేపీ పాలెం తుఫాన్ రక్షిత భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల సందర్శించారు.  ఆశ్రయం పొందిన వారితో  ఏర్పాట్లపై ఆరా తీశారు.   మీకు పెట్టే భోజనమే నేను తింటా.. మీతోనే మేము.. ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.   

తుఫాను తీరం దాటిన అనంతరం చర్యలలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.  తొలుత జిల్లా కలెక్టర్ నరసాపురం మండలం డిజిటల్ భవన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి,  ఆశ్రయం పొందిన వారిని ఆప్యాయంగా పలకరించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  పునరావాస కేంద్రంలో అన్ని ఏర్పాట్లు బాగున్నాయా, భోజనం ఎలా ఉంది, మా అధికారులు బాగానే స్పందిస్తున్నారా తదితర వివరాలను తెలుసుకున్నారు.  బాధితులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి కలెక్టర్ కూడా వారితో పాటు కూర్చుని వారు తినే పదార్థాలనే ఆమె కూడా భుజించడంతో వారిలో ఒకింత ఆశ్చర్యం, ఒకింత మనోధైర్యం కనిపించాయి.  

భోజనం చేస్తూనే బాధితులతో యోగక్షేమాలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు అనే తారతమ్యం లేదని, ప్రభుత్వం ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని తెలిపారు.  ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు అన్నారు.  ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మీ నిర్మలమ్మ మీ గ్రామం పై ప్రత్యేక శ్రద్ధతో అనేక కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తున్నారని, త్వరలో సముద్రపు కోత అడ్డుకట్ట నిర్మాణం కూడా పూర్తి కావస్తుందని,  తుఫాన్లు సమయంలో భయపడవలసిన అవసరం ఉండదని ధైర్యం చెప్పారు.  పెద్దమైన వాని లంక వద్ద ఒక కిలోమీటర్ పరిధిలో నిర్మిస్తున్న  సముద్ర కోత అడ్డుకట్ట నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు.  సంబంధిత ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడి పనులు ఎప్పటికీ పూర్తి అవుతాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  

డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు.  అనంతరం వేముల దీవి మత్స్యకార బాలుర బీసీ వెల్ఫేస్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.  లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా తొలగేంత వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని తెలిపారు. తదుపరి మొగల్తూరు కేపీ పాలెం తుఫాన్ రక్షిత భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి  ఆశ్రయం పొందిన వారితో  ఏర్పాట్లపై ఆరా తీశారు.  అక్కడ ఏర్పాటుచేసిన మెడికల్ లో సిబ్బందితో మాట్లాడుతూ పాముకాటు కేసులు ఏమైనా వచ్చాయా, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆశ్రయం పొందిన బాధితులతో మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత కాచి చల్లార్చిన నీటిని తాగాలని,  పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.  భిన్నమైన వాతావరణంలో అంటువ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని జాగ్రత్త వహించాలని తెలిపారు.  మార్గం మధ్యలో ఎన్టీఆర్ బృందాలను కలుసుకొని వారి సేవలను అభినందించారు. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Chandrababu Speech Bhogapuram Airport Inauguration : 2027లో పోలవరం, 2028లో అమరావతి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభం - భోగాపురంలో చంద్రబాబు కీలక ప్రకటన
2027లో పోలవరం, 2028లో అమరావతి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభం - భోగాపురంలో చంద్రబాబు కీలక ప్రకటన
Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Nara Lokesh Speech At Bhogapuram Airport: ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget