అన్వేషించండి

Montha Cyclone:తుపాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా? సైక్లోన్, హరికేన్, టైఫూన్ వెనుక అసలు రహస్యాలు ఇవే!

Montha Cyclone:చారిత్రకమైన పేర్లను తుపానులకు పెట్టడం వల్ల ఆయా ప్రాంతాల ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఈ పేర్లు ఒకప్పటి నావికులు వాడిన కారణంగా అక్కడి ప్రజల్లోకి చొచ్చుకెళ్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

How Hurricanes are Classified: ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల తుపానులను (Tropical Cyclones) అవి ఏ సముద్ర ప్రాంతంలో ఏర్పడుతున్నాయనే దాని ఆధారంగా ఆ తుపానులను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తుపానులన్నీ ఒకే రకమైన వాతావరణ వ్యవస్థలో భాగం అయినప్పటికీ, వాటిని గుర్తించడానికి, హెచ్చరిక జారీ చేయడానికి వర్గీకరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ తుపానులకు ప్రధానంగా వాడుకలో ఉన్న పేర్లు ఇవే

1. సైక్లోన్ (Cyclone): హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాలలో (భారతదేశం, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా పశ్చిమ భాగం) వచ్చే తుపానులను సైక్లోన్‌గా పిలుస్తారు.

2. హరికేన్ (Hurricane): అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో (అమెరికా, కరేబియన్) వచ్చే తుపానులను హరికేన్‌గా పిలుస్తారు.

3. టైఫూన్ (Typhoon): పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలైన (జపాన్, ఫిలిప్పీన్స్, చైనా) లలో వచ్చే తుపానులను టైఫూన్‌గా నామకరణం చేయడం జరిగింది.

ఇలా సముద్ర ప్రాంతాలను బట్టి తుపానులను సైక్లోన్, హరికేన్, టైఫూన్‌గా పిలవడం జరిగింది. అయితే, దీని వెనుక కూడా చారిత్రక మూలాలతో పాటు పలు అంశాలు ఇమిడి ఉన్నాయి.

హరికేన్ (Hurricane): ఈ పదాన్ని ఎక్కువగా అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం, ఈశాన్య పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో వాడతారు. దీని చారిత్రక మూలం పరిశీలిస్తే, "హరికేన్" అనే పదం కరేబియన్ ప్రాంతంలోని స్థానిక తెగైన టైన్యో (Taíno) ప్రజల నుంచి వచ్చింది. ఈ తెగ ప్రజలు తుపానులకు అధిపతిగా "జురాకాన్ (Juracán)" అని పిలుస్తూ దేవుడిగా ఆరాధిస్తారు. వీరితోపాటు మాయన్ అనే తెగ ప్రజల గాలి దేవుడి పేరు "హురాకాన్ (Huracan)" కూడా దీనికి మూలంగా భావిస్తారు. స్పెయిన్ అన్వేషకులు ఈ పదాలను కలిపి "హూరాకాన్ (Huracán)"గా పిలిచారు. ఈ పదం క్రమంగా ఆంగ్లంలో "హరికేన్‌"గా స్థిరపడింది.

టైఫూన్ (Typhoon): ఈ పదం వాయువ్య పసిఫిక్ మహాసముద్రం, చైనా సముద్రం ప్రాంతాల్లో వాడతారు. "టైఫూన్" అనే పదం గ్రీక, చైనీస్ పదాల కలయికతో ఏర్పడింది. గ్రీకు భాషలో "సుడిగాలి" లేదా "భయంకరమైన గాలి" అనే అర్థం వచ్చే "టైఫాన్ (Typhōn)" లేదా "టుఫోన్ (Typhōn)" అనే పదం నుంచి, చైనా భాషలో "గొప్ప గాలి" లేదా "పెద్ద గాలి" అనే అర్థం వచ్చే కాంటోనీస్ పదం "తాయ్ ఫంగ్ (tai fung)" అనే మాండరిన్ భాష నుంచి వచ్చి ఉండవచ్చని చెబుతారు. ఈ తుపానులను అప్పటి నావికులు ఇలా పిలవడం కారణంగా టైఫూన్ అని స్థిరపడింది.

ట్రాపికల్ సైక్లోన్ (Tropical Cyclone): ట్రాపికల్ సైక్లోన్ (ఉష్ణమండల తుఫాను) అనేది ఈ వ్యవస్థలన్నింటికీ సాధారణంగా ఉపయోగించే శాస్త్రీయ పదం. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ఉష్ణమండల (Tropical) ప్రాంతంలోని వెచ్చని సముద్రాలపై ఇవి ఏర్పడతాయి కాబట్టి ఈ పేరు వచ్చింది.

ఇలా పేర్ల కేటాయింపు, ప్రాంతాలుగా విభజించడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇలాంటి విభజన, పేర్లు పెట్టడం వంటి కార్యకలాపాలను ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization - WMO) పర్యవేక్షిస్తుంది.

ఈ విభజనకు ప్రధాన కారణాలు ఇవే:

తుపానుల గుర్తింపు సులభం: ఒకేసారి ఆయా ప్రాంతాల్లో తుపానులు ఏర్పడినప్పుడు వాటిని సులభంగా గుర్తించవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా హెచ్చరికలను అందించడానికి ప్రాంతాల వారీగా పేర్లు అవసరం. తద్వారా తుపాను హెచ్చరికలను స్పష్టంగా ఆయా ప్రాంతాలకు అందజేసే అవకాశం ఉంటుంది.

పర్యవేక్షణ సులభం: ప్రాంతీయ తుపాను హెచ్చరికల కేంద్రాలు (Regional Warning Centers) ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంస్థలు వేర్వేరు ప్రాంతాలను పర్యవేక్షిస్తాయి. హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో తుపానులను సైక్లోన్ అంటారు. ఈ ప్రాంతానికి భారతదేశంలోని IMD (భారత వాతావరణ శాఖ) హెచ్చరికలు జారీ చేస్తుంది. అట్లాంటిక్ సముద్ర పరిధిలో దీనిని హరికేన్ అంటారు. దీనికి US నేషనల్ హరికేన్ సెంటర్ (NHC) హెచ్చరికలు జారీ చేస్తుంది. వాయువ్య పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో తుపానును టైఫూన్ అంటారు. దీనికి జపాన్‌లోని RSMC టోక్యో హెచ్చరికలు జారీ చేస్తుంది.

ప్రజల్లో అవగాహన: ఇలా చారిత్రకమైన పేర్లను తుపానులకు పెట్టడం వల్ల ఆయా ప్రాంతాల ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఈ పేర్లు ఒకప్పటి నావికులు వాడిన కారణంగా అక్కడి ప్రజల్లోకి చొచ్చుకెళ్తుంది.

ఇలా ప్రాంతీయ కేంద్రాలు, వాటి పరిధి, తుపానులకు పేర్లు పెట్టడం వంటి పర్యవేక్షణ కార్యకలాపాల కోసం ప్రపంచాన్ని ఆరు ప్రధాన బేసిన్‌లుగా విభజించడం జరిగింది. ప్రతి బేసిన్‌కు ఆర్.ఎస్.ఎం.సి (RSMC) అంటే ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం (Regional Specialized Meteorological Centre) ఉంటుంది. ఆయా కేంద్రాలు తమ పరిధిలోని దేశాల జాబితాల నుంచి పేర్లను ఎంపిక చేస్తాయి. సైక్లోన్ వస్తే ఉత్తర హిందూ మహా సముద్రం, బంగాళా ఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాలకు తుపానుకు పేరు పెట్టడానికి ఆర్.ఎస్.ఎం.సి న్యూఢిల్లీ సమన్వయం చేస్తుంది. హరికేన్ ఏర్పడితే, వాటికి పేర్లు పెట్టడానికి, హెచ్చరికలు జారీ చేయడానికి ఉత్తర అట్లాంటిక్, తూర్పు ఉత్తర పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో హరికేన్ వస్తే, నేషనల్ హరికేన్ సెంటర్ (NHC), మయామి, USA తమ రీజియన్‌లో ఉన్న దేశాలతో సమన్వయం చేస్తుంది. అదే రీతిలో టైఫూన్స్ విషయానికి వస్తే, వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో తుపానులు వస్తే, ఆర్.ఎస్.ఎం.సి టోక్యో (జపాన్) బాధ్యతలు చేపడుతుంది. నైరుతి హిందూ మహాసముద్రంలో సైక్లోన్ వస్తే, RSMC, రియూనియన్ (ఫ్రాన్స్) హెచ్చరికలు చేయడం, ఆ తుపానులకు పేరు పెట్టే బాధ్యతలను సమన్వయపరుస్తుంది.

ప్రస్తుతం మన న్యూ ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఆర్.ఎస్.ఎం.సిలో 13 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో భారతదేశం, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), యెమెన్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం మోంథా తుపాను పేరును ఈ కేంద్రంలో భాగమైన థాయ్‌లాండ్ దేశం సూచించింది. మోంథా అంటే థాయ్ భాషలో సువాసన గల పువ్వు లేదా అందమైన పువ్వు అని అర్థం.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read

Frequently Asked Questions

ఉష్ణమండల తుపానులను వేర్వేరు పేర్లతో ఎందుకు పిలుస్తారు?

తుపానులన్నీ ఒకే వాతావరణ వ్యవస్థ అయినప్పటికీ, అవి ఏర్పడే సముద్ర ప్రాంతాన్ని బట్టి సైక్లోన్, హరికేన్, టైఫూన్ అని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇది వాటిని గుర్తించడానికి, హెచ్చరికలు జారీ చేయడానికి సహాయపడుతుంది.

హరికేన్ (Hurricane) అనే పదం ఎలా వచ్చింది?

హరికేన్ అనే పదం కరేబియన్ స్థానిక తెగ అయిన టైన్యో ప్రజల 'జురాకాన్' (తుపానుల దేవుడు) లేదా మాయన్ల గాలి దేవుడు 'హురాకాన్' నుంచి వచ్చింది. స్పెయిన్ అన్వేషకులు ఈ పదాలను కలిపి 'హూరాకాన్' అని పిలిచారు, ఇది కాలక్రమేణా 'హరికేన్'గా మారింది.

టైఫూన్ (Typhoon) అనే పదం ఏ భాషల నుంచి వచ్చింది?

టైఫూన్ అనే పదం గ్రీకు పదం 'టైఫాన్' (భయంకరమైన గాలి) మరియు చైనీస్ పదం 'తాయ్ ఫంగ్' (గొప్ప గాలి) కలయికతో ఏర్పడిందని భావిస్తారు.

తుపానులకు పేర్లు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తుపానులను సులభంగా గుర్తించడానికి, గందరగోళం లేకుండా హెచ్చరికలు అందించడానికి, ప్రజల్లో అవగాహన పెంచడానికి పేర్లు పెట్టడం ఉపయోగపడుతుంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Telugu TV Movies Today: ఆదివారం టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్.. పూర్తి లిస్ట్ ఇదే..
ఆదివారం టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్.. పూర్తి లిస్ట్ ఇదే..
Advertisement

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Telugu TV Movies Today: ఆదివారం టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్.. పూర్తి లిస్ట్ ఇదే..
ఆదివారం టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్.. పూర్తి లిస్ట్ ఇదే..
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
జనవరి 14 భోగి రోజు మూడు శుభ యోగాలలో షట్తిలా ఏకాదశి వ్రతం, 23 సంవత్సరాల తర్వాత అద్భుతమైన కలయిక!
జనవరి 14 భోగి రోజు మూడు శుభ యోగాలలో షట్తిలా ఏకాదశి వ్రతం, 23 సంవత్సరాల తర్వాత అద్భుతమైన కలయిక!
iPhone Fold Phone: మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
Embed widget