Chhattisgarh encounter : చత్తీస్ ఘడ్ ఎన్‌కౌంటర్ మృతుల్లో మరికొంత మంది తెలుగువారు - పది మంది మహిళలూ హతం!
Encounter: ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారి వివరాలను గుర్తించారు. నంబాల కేశవరావు కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు చనిపోయిన వారిలో ఉన్నారు.

Chhattisgarh encounter Maoists: చత్తీస్ ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లా, అబుజ్ మాడ్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 10 మంది మహిళలతో సహా మొత్తం 27 మృతి చెందారని ఛత్తీస్ ఘడ్ డిజిపి అరుణ్ దేవ్ గౌతమ్ వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో గాలింపు జరిపిన పోలీసులు.. ఘటనా స్థలం వద్ద 27 మృతదేహాలతో పాటు.. భారీ ఎత్తున ఆయుధాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాలతో పాటు స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఇతర సామాగ్రిని నారాయణపూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన 27 మందిలో నంబాల కేశవరావు కాకుండా మరో ఇద్దరు తెలుగువారిని గుర్తించారు. సీసీ మెంబర్ "నంబాల కేశవరావు", @ బసవరాజుపై చత్తీస్-ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రివార్డ్ 1.5 కోట్లు ఉండగా.. శ్రీకాకుళం జిల్లా, జీయన్నపేట స్వస్తలం. మరో తెలుగు మావోయిస్టు నేత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ "వెంకట్ నాగేశ్వరరావు" @యాసన్న, @జంగు నవీన్ కూడా ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఈయనపై 25 లక్షల రివార్డ్ ఉంది. యాసన్న స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా.
ఈ ఎదురు కాల్పుల్లో తెలంగాణలోని హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన బుర రాకేష్ అలియాస్ వివేక్ మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. రాకేష్ బసవరాజు అలియాస్ కేశవరావు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం.
బాబు, స్వరూప ల రెండవ కుమారుడు రాకేష్ వరంగల్ నగరంలోని సీ కే ఏం కళాశాలలో పీజీ చేస్తూ 2016 లో ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నేటి వరకు కుటుంబంతో సంబంధాలు లేవు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్నారు.





















