Death Threats to CM: సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులు... పోలీసులు అప్రమత్తం
Death Threat to CM: ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సులకు ఫోన్ చేసి.. ముఖ్యమంత్రిని చంపేస్తానంటూ చెప్పాడు.. రాత్రి 11 గంటలకు వచ్చిన ఫోన్ కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Death Threat to CM: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఓ ఆగంతకుడు నేరుగా పోలీసులకే ఫోన్ చేసి సీఎంను చంపేస్తున్నామని సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని IANS వార్తా సంస్థ వెల్లడించింది. నిందితులను పట్టుకునేందుకు ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి నిన్న రాత్రి ఘజియాబాద్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి Delhi CM Rekha Guptaను చంపేస్తానని బెదిరించాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ పీసీఆర్‌కు ఫోన్ వచ్చింది, ఆ తర్వాత వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని, అతని లొకేషన్‌ను గుర్తించే పనిలో ఉన్నారు.
ఘజియాబాద్ సిటీ డీసీపీ ఈ విషయాన్ని ధృవీకరించారు, అయితే ఫోన్ చేసిన వ్యక్తి ఆ తర్వాత తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు.
"ఘజియాబాద్ పోలీసుల నుండి నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ పోలీసులకు ఈ సమాచారం అందింది. ప్రస్తుతం ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు" అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Ghaziabad, Uttar Pradesh: ACP Kotwali Nagar, Ritesh Tripathi says, "...Further investigation and action will be taken regarding the number from which the call was made.. Further investigation and action will be taken regarding the number from which the call was made"
— IANS (@ians_india) June 6, 2025
(Video… https://t.co/Rq5l0uWTv2 pic.twitter.com/0Nn4GCDaX1
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత రేఖా గుప్తను సీఎంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. రేఖా గుప్తకు బెదిరింపు కాల్స్ ఆకతాయిల పనా... లేక నిజంగా ఏదైనా విద్రోహ చర్య ఉండబోతోందా అని పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్‌గానే దృష్టి పెట్టారు. పహల్గామ్ ఘటన తర్వాత రాజకీయ నాయకుల భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఢిల్లీకి సీఎంగా ఎంపికైన రేఖ.. తొలిసారి ఎమ్మెల్యేగానే సీఎం అయినప్పటికీ ఆవిడ చాలా ఏళ్లుాగా ఢిల్లీ రాజకీయాల్లోనే ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలిచారు. సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పోరేషన్‌కు మేయర్‌గా కూడా పనిచేశారు.





















