(Source: ECI/ABP News/ABP Majha)
Rekha Sister: నటి కావాల్సిన రేఖ చెల్లెలు రాధ - ఆ ఒక్క తప్పుతో జీవితం మారిపోయిందిగా!
Rekha: బాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ బ్యూటీ క్వీన్‌గా ఎదిగారు రేఖ. కానీ తన చెల్లిలు రాధను మాత్రం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌ను చేయలేకపోయారు. దానికి రాధ చేసిన ఆ ఒక్క తప్పే కారణం!
Rekha Sister Radha: 80, 90ల్లో బాలీవుడ్‌లోని ఎంతోమంది హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చారు రేఖ. ఇప్పటికీ తనను ఎవర్‌గ్రీన్ బ్యూటీ అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తారు. మామూలుగా ఒక హీరో లేదా హీరోయిన్.. నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వారి చెల్లిళ్లను, తముళ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటారు. కానీ ఇద్దరూ ఒకే రేంజ్‌లో సక్సెస్‌ను సాధించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. రేఖ విషయంలో కూడా అదే జరిగింది. రేఖ.. హీరోయిన్‌గా సక్సెస్‌ను అందుకున్న తర్వాత తన సోదరి రాధను హీరోయిన్‌గా పరిచయం చేసింది. కానీ కెరీర్ విషయంలో రాధ చేసిన ఒక్క తప్పు వల్ల తన జీవితమే మారిపోయింది.
జెమినీ గణేశన్ వారసులు..
బాలీవుడ్‌లో రేఖ ఎంత పాపులర్ అయినా.. తన పర్సనల్ లైఫ్ గురించి, ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. అలాగే తన చెల్లి రాధ గురించి కూడా తెలియదు. రేఖది చాలా పెద్ద కుటుంబం. వారు ఆరుగురు అక్కా చెల్లెళ్లు, వారందరికీ ఒక సోదురుడు కూడా ఉన్నాడు. రేఖ తండ్రి పేరు జెమినీ గణేశన్. ఆయన కూడా ఒకప్పటి నటుడే. జెమినీ గణేశన్ పర్సనల్ లైఫ్‌లో చాలా కాంట్రవర్సీలు నడిచాయి. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు మొదటి భార్య ద్వారా నలుగురు కూతుళ్లు, రెండో భార్య ద్వారా ఇద్దరు కూతుళ్లు.. ఇక మూడో భార్య సావిత్రి ద్వారా ఒక కొడుకు, కూతురు జన్మించారు. వారందరిలో రేఖ కూడా ఒకరు. జెమినీ గణేశన్ రెండో భార్య కూతురే రేఖ. ఇక తన సొంత చెల్లి పేరు రాధ.
ఆ స్థానంలోకి డింపుల్ కపాడియా..
రేఖలాగానే రాధ కూడా మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. పలు తమిళ సినిమాల్లో నటిగా మెప్పించారు కూడా. అంతే కాకుండా పాపులర్ మ్యాగజిన్స్‌కు ఫోటోషూట్స్ చేస్తూ రాధ.. ఎప్పుడూ బిజీగా ఉండేవారు. తనకు సినిమాలకంటే ఎక్కువగా మోడలింగ్ అంటేనే ఆసక్తి ఉండేది. అప్పట్లో రాజ్ కపూర్ తెరకెక్కించిన ‘బాబీ’ చిత్రం రాధ చేతికి వచ్చింది. రిషీ కపూర్‌కు జంటగా రాధ నటిస్తే బాగుంటుందని రాజ్ కపూర్ భావించినా.. రాధ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. దీంతో ఆ ఛాన్స్ డింపుల్ కపాడియా చేతికి వెళ్లింది. ‘బాబీ’ మూవీ తెచ్చిపెట్టిన పాపులారిటీతో డింపుల్ కపాడియా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఇక 1981లో పెళ్లి చేసుకున్న రాధ.. ఆ తర్వాత పూర్తిగా గ్లామర్ ఇండస్ట్రీకి దూరమయ్యింది.
అమెరికాలో సెటిల్..
1981లో తన చిన్నప్పటి స్నేహితుడు ఉస్మాన్ సయ్యద్‌ను పెళ్లి చేసుకున్నారు రాధ. ప్రముఖ సౌత్ ఇండియన్ నటుడు ఎస్ ఎమ్ అబ్బాస్ కుమారుడే ఉస్మాన్ సయ్యద్. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తనతో పాటు అమెరికాకు షిఫ్ట్ అయిపోయారు రాధ. వారికి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరికీ ఇప్పుడు పెళ్లిళ్లు అయిపోయాయి. అప్పట్లో ‘బాబీ’ సినిమా ఆఫర్‌ను రేఖ అంగీకరించుంటే తను కూడా రేఖలాగా పెద్ద స్టార్ అయ్యిండేందని చాలామంది ప్రేక్షకులు గుర్తుచేసుకుంటారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ అప్పుడప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తున్నారు రేఖ. అంతే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా ఎక్కువగా పార్టీలకు అటెండ్ అవుతూ వైరల్ అవుతుంటారు.
Also Read: ‘యానిమల్‘ ఓటీటీ రిలీజ్ కు కష్టాలు - సమన్లు జారీ చేసిన న్యాయస్థానం