అన్వేషించండి

Animal OTT Release: ‘యానిమల్‘ ఓటీటీ రిలీజ్ కు కష్టాలు - సమన్లు జారీ చేసిన న్యాయస్థానం

Animal OTT Release: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ కు చిక్కులు ఎదురయ్యాయి. సినిమా విడుదలకు సంబంధించి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

Animal OTT Release: బాలీవుడ్‌ స్టార్ హీరో రణబీర్‌ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో, హీరోయిన్లు గా  నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'యానిమల్‌'. సందీప్‌ రెండ్డి వంగా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రి-కొడుకు మధ్య సెంటిమెంట్ బేస్ చేసుకుని రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల మీద తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, వసూళ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి విడుదల అవుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్  గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్ కు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, తాజాగా ఓటీటీలో ఈ మూవీ విడుదలకు సంబంధించి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.    

‘యానిమల్‌’ మూవీకి ఓటీటీ రిలీజ్‌ కష్టాలు  

‘యానిమల్’ సినిమాను  టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్కలిసి నిర్మించాయి. తాజాగా ‘యానిమల్’ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలంటూ సినీ1 స్టూడియోస్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మూవీ శాటిలైట్‌ రైట్స్ విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగిందని, అయితే, వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు అందలేదని వెల్లడించింది. తనకు రావాల్సిన వాటా వచ్చేంత వరకు ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో నెట్‌ ఫ్లిక్స్‌ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై ఇవాళ (జనవరి 20)లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.  

ఓటీటీలో ఆ సీన్లు ఉండబోతున్నట్లు వెల్లడించిన దర్శకుడు   

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ నిడివి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యానిమల్‌’ రన్‌ టైమ్‌ మూడున్నర గంటలు ఉండటంతో ఆడియెన్స్ ఇబ్బంది పడతారని 9 నిమిషాల సన్నివేశాలను కట్ చేసినట్లు చెప్పారు. ఓటీటీలో మాత్రం ఆ సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. అంటేకాదు, థియేటర్‌ కోసం తొలగించిన కొన్ని షాట్లను కూడా ఓటీటీ వెర్షన్‌కు యాడ్‌ చేస్తున్నట్లు వివరించారు. ఇందులో రష్మికతో రణబీర్‌ లిప్‌లాక్‌ సీన్స్‌ కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

‘యానిమ‌ల్’ మూవీలో బాబీ డియోల్ విల‌న్‌గా కనిపించగా, రణబీర్‌ క‌పూర్ తండ్రిగా అనిల్ క‌పూర్ న‌టించాడు. త్రిప్తి దిమ్రీ మరో కీలకపాత్రలో కనిపించింది. ఈ మూవీకి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందించారు. టీ సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్‌తో క‌లిసి సందీప్ వంగా సోద‌రుడు ప్ర‌ణ‌య్ వంగా ఈ మూవీని నిర్మించాడు. ‘యానిమ‌ల్’ మూవీ త‌ర్వాత ప్ర‌భాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయ‌బోతున్నాడు సందీప్ వంగా.

Read Also: రష్మికతో ఎంగేజ్‌మెంట్, విజయ్ దేవరకొండ అంతమాట అనేశాడేంటి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది
శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hellallallo Song Telugu Lyrics : ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్
Save The Tigers Series season 3 : సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Peddi Hallallallo Song : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Embed widget