Sonia Gandhi Meeting: 'భాజపా ప్రచారాన్ని తిప్పికొట్టండి.. వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీయే ముఖ్యం'
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ నేతలు, పీసీసీ చీఫ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
కాంగ్రెస్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జీలు, పీసీసీ అధ్యక్షులతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ చేస్తోన్న దుష్ప్రచాారాన్ని సైద్ధాంతికంగా తిప్పికొట్టాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.
భాజపా చేసే అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ నేతలు సంసిద్ధంగా ఉండాలన్నారు. పార్టీలో సంస్కరణలు కోరుతూ లేఖ రాసిన 23 మంది నేతలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు సోనియా. వ్యక్తిగత లక్ష్యాల కంటే పార్టీ బలోపేతమే ప్రతి ఒక్కరికీ ముఖ్యం కావాలని ఆకాంక్షించారు.
"The fight to defend our democracy, our Constitution & the Congress Party’s ideology begins with being fully prepared to identify and counter false propaganda": Congress Interim President Sonia Gandhi in her opening remarks during the meeting
— ANI (@ANI) October 26, 2021
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా పలు రాష్ట్రాల నుంచి సీనియర్ నేతలు హాజరయ్యారు.