CM Jagan: అవినీతికి పాల్పడాలని ఎమ్మెల్యేలకు చెప్పింది జగనే - నారాయణ కీలక వ్యాఖ్యలు
Tirupati News: వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయంమని, అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యేలకు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అని నారాయణ ఆరోపించారు..
CPI Narayana on CM Jagan: తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఏపిలోనూ పునరావృతం కాబోతాయని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.. ఇవాళ (డిసెంబర్ 12) తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయంమని, అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యేలకు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అని నారాయణ ఆరోపించారు.. రాష్ట్రాన్ని దోచేసిన తరువాత ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ఉపయోగమేంటని ఆయన ప్రశ్నించారు.. ఇన్చార్జ్ లు, ఎమ్మెల్యే అభ్యర్థులు కాదని.. అసలు వైఎస్ఆర్ సీపీలో సీఎం అభ్యర్థినే మార్చాలని నారాయణ డిమాండ్ చేసారు.
ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడం, పాలన చేత కాకపోవడం వచ్చే ఎన్నిఅకల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలు అని ఆయన తెలియజేశారు.. గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి అదే గాల్లోనే కలిసిపోవడం ఖాయంమని, పొగరు, అవినీతి, అహంకారంకు జగన్మోహన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. బైజూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పిన ఆయన, బైజ్యూస్, బజాజ్ కార్యాలయాలను పగలగొట్టాలని అన్నారు. తుపాను వల్ల తిరుపతి జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని, 18 లక్షల ఎకరాలలో అన్ని రకాల పంట నష్టం జరిగిందని అన్నారు.. మిచౌన్ తుపాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.. జమ్ము కశ్మీర్ పైన, 370 అర్టికల్ పైన వచ్చిన తీర్పు దురదృష్టకరంమని ఆయన వ్యతిరేకించారు.. న్యాయ వ్యవస్థ ఒక పంజరంలోని చిలుకగా మారిందని, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీలకు దాని ప్రాదాన్యత ఎలా తెలుస్తుందని అన్నారు.
అందుకే 370 ఆర్టికల్ గురించి వారికి తెలియడం లేదని అన్నారు.. భారతదేశాన్ని విడగొట్టే రీతిలో బీజేపీ పాలన సాగుతోందని, చివరకు నిజంకు వ్యతిరేకంగా కూడా బీజేపీ పోరాడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. సుప్రీంకోర్టు తప్పు చేసిందని చెబుతున్నా, అరెస్ట్ చేసినా ఫర్వాలేదని, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ డెకాయిట్లతో సైతం రాజీ పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.