By: ABP Desam | Updated at : 08 Jul 2022 11:11 PM (IST)
అమర్‌నాథ్ యాత్రకు మరో గండం - భారీ వర్షాలు
Cloudburst Near Amarnath Shrine : భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైన ఒక్క రోజులో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మళ్లీ భారీ వర్షాలు పడటంతో కొండలపై నుంచి వరద దిగువకు జారుతోంది. ఇప్పటికే పదమూడు మంది చనిపోయారు. ఆలయం దగ్గర భక్తులు వేసుకున్న టెంట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో పెద్ద ఎత్తున బలగాలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించాయి. ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకూ ఎవరికీ గాయాలు కూడా కాలేదని తెలుస్తోంది.
#WATCH | J&K: Massive amount of water flowing turbulently after a cloud burst occurred in the lower reaches of Amarnath cave. Rescue operation is underway at the site pic.twitter.com/w97pPU0c6k
— ANI (@ANI) July 8, 2022
J&K: Visuals from lower reaches of Amarnath cave where a #cloudburst was reported at around 5.30 pm. “Rescue operation underway by NDRF, SDRF & other agencies”: Joint Police Control Room, Pahalgam. “Water came from above the cave after heavy rains in the upper reaches”: ITBP pic.twitter.com/t4t3dHtUJK
— Neha Khanna (@nehakhanna_07) July 8, 2022
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా మంగళవారం యాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పహల్గామ్, బల్తాన్ రూట్లలోని క్యాంపుల వద్దనే యాత్రికులను ఆపేశారు. వాతావరణం మెరుగుపడటంతో బుధవారం ఉదయం యాత్రను తిరిగి ప్రారంభించారు. అమరనాథ్ యాత్ర సోమవారం నాటికి ఐదో రోజుకు చేరగా.. ఒకే రోజు 19వేల మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర కోసం జమ్మూకశ్మీర్ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్ర సాగుతున్న కొద్ది యాత్రికుల సంఖ్య పెరుగుతోందని అమర్‌నాథ్ క్షేత్ర ట్రస్ట్ బోర్డ్ తెలిపింది. దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూకు తరలివస్తున్నారు. అయితే వర్షాలు వారిక ిగండంగా మారాయి.
Cloudburst near #amarnath cave...rescue effort started by authorities...according to sources some causalities also feared...several people were trapped when flash flood hit the camp site near the cave.#cloudburst #AmarnathYatra #AmarnathCloudBrust pic.twitter.com/1vyPn66NZ3
— Anurag Sisodia 🇮🇳 (@AnuragSisodia14) July 8, 2022
అమరనాత్ యాత్ర అత్యంత సంక్లిష్టతతో కూడుకున్నది. అయినా భక్తులు ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తూంటారు. ఒక్కో సారి మంచు ప్రతాపం చూపిస్తూ ఉంటుంది. ఈ సారి భారీ వర్షాలు భక్తులకుపరీక్ష పెడుతున్నాయి.
BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?
SSC CHSL Final Answer Key 2021: సీహెచ్ఎస్ఎల్-2021 ఫైనల్ కీ వచ్చేసింది, ఇలా చూసుకోండి!
Bilkis Bano : "బిల్కిస్ బానో" కేసు దోషులందరూ రిలీజ్ - దేశవ్యాప్తంగా విమర్శలు !
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు
Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!